Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
Manipur Violence | మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్నది. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఆగ్రహించిన స్థానికులు మృతదేహాలను సీఎం నివాసం వద్దకు తరలించి నిరసన తెలిపారు. తాజా హింసాత్మక ఘటనలతో మణిపూర్‌లో భద్రతా పరిస్థితి మరింత దిగజారింది.
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్నది. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఆగ్రహించిన స్థానికులు మృతదేహాలను సీఎం నివాసం వద్దకు తరలించి నిరసన తెలిపారు. తాజా హింసాత్మక ఘటనలతో మణిపూర్‌లో భద్రతా పరిస్థితి మరింత దిగజారింది. (Manipur Violence) మొదటి ఘటనలో మైతేయి ప్రజలు, పాంగల్ ముస్లింలు నివసించే ప్రాంతంలో ఒక సంగీత కార్యక్రమం జరుగుతుండగా హింస చెలరేగింది. రాళ్ల దాడి, కాల్పులు జరుగడంతో పలువురు గాయపడ్డారు. బుల్లెట్ గాయాలైన 24 ఏళ్ల యువకుడు మరణించాడు.
కాగా, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్లోక్ ప్రాంతంలో మరో హింసాత్మక ఘటన జరిగింది. సమీపంలోని కొండల్లో కట్టెల కోసం వెళ్లిన ముగ్గురు గ్రామస్తులను, కుకీ గిరిజన మిలిటెంట్లుగా అనుమానించిన వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు.
అయితే ఈ హత్యలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి మృతదేహాలను తరలించి నిరసన చేపట్టగా పోలీసులు వాటిని బలవంతంగా తొలగించారు. ఆందోళనకారును చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేశారు.
మరోవైపు రాజ్ మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ పరామర్శించారు. సమీపంలోని ఎస్వోవో శిబిరాన్ని తొలగించడంతో సహా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తోక్చోమ్ లోకేశోర్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ హత్యల నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తడంతో ఇంఫాల్ నగరం దాదాపు స్తంభించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

