నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 974 మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థిని నోముల రిషితకు నల్లగొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, క్రెడాయ్ అసోసియేషన్ సంయుక్తంగా రూ.55,000 ఆర్థిక సాయం అందించాయి. సోమవారం ఉదయం శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో...
రామగిరి, అక్టోబర్ 19 : ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 974 మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థిని నోముల రిషితకు నల్లగొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, క్రెడాయ్ అసోసియేషన్ సంయుక్తంగా రూ.55,000 ఆర్థిక సాయం అందించాయి. సోమవారం ఉదయం శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా రిషితకు చెక్కును అందజేశారు. నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడకు చెందిన విజయ్ కుమార్తె రిషిత ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి అత్యుత్తమ మార్కులు సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఘట్కేసర్లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం సీఈసీ బ్రాంచ్‌లో కళాశాల ఫీజు మినహాయించి, రూ.1.10 లక్షల హాస్టల్ ఫీజుతో ఉన్నత విద్యకు అవకాశం కల్పించింది.
రిషిత ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఫైనాన్స్, క్రెడాయ్ అసోసియేషన్ సభ్యులు ఆమె చదువుకు తోడ్పాటుగా రూ.55 వేల సాయం అందించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారంతో పాటు దానగుణాన్ని కలిగి ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. రిషిత ఇంజనీరింగ్‌లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆమంచి రాజలింగం, జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి మామిడి శ్రవణ్, క్రెడాయ్ కోశాధికారి నాంపల్లి మనోహర్, నేతి విప్లవ్ కుమార్, ఇరు అసోసియేషన్ల సభ్యులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

