Oppo Reno 7Z 5G | ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ త్వరలో రానుంది. ఒప్పో రెనో 7జెడ్ 5జీ ఫోన్ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసేందుకు ఒప్పో సన్నాహాలు చేస్తోంది. రెండు కలర్ల వేరియంట్లలో రానున్న ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్, 4500 ఎంఏహెచ్ ప్రాససర్, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. వాటితో పాటు 8 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్, ట్రిపుల్ రేర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 4500 ఎంఏహెచ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లాంటి ఫీచర్లు ఒప్పో రెనో 7జెడ్ ఫోన్లో ఉండనున్నాయి.
5జీ ఫీచర్తో రానున్న ఈ ఫోన్ లాంచ్ డేట్, ధర, ఫీచర్ల గురించి ఒప్పో అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఫీచర్లు దాదాపుగా ఇవే ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. బెస్ట్ ఫీచర్లతోనే రెనో 7జెడ్ సిరీస్ను ఒప్పో లాంచ్ చేయనుంది.