Oppo Reno 7 | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి రెనో సిరీస్ తాజాగా భారత్‌లో రిలీజ్ అయింది. ఒప్పో రెనో 7, రెనో 7 ప్రో 5జీ ఫోన్లు లాంచ్ అయ్యాయి. గత సంవత్సరం నవంబర్లోనే ఒప్పో రెనో 7 5జీ, రెనో 7 ప్రో 5జీ ఫోన్లు చైనాలో రిలీజ్ అయ్యాయి. చైనాలో రిలీజ్ అయిన ఒప్పో రెనో 7 సిరీస్‌కు.. భారత్‌లో తాజాగా రిలీజ్ అయిన రెనో 7 సిరీస్ ఫీచర్లలో చాలా తేడాలు ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఎంఐ 11 ఎక్స్, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, వన్‌ప్లస్ నోర్డ్ 2 లాంటి ఫోన్లకు పోటీగా ఒప్పో నుంచి రెనో 7 సిరీస్ విడుదలైంది. ఒప్పో రెనో 7 5జీ ఫోన్ ధరను రూ.28,999 గా నిర్ణయించారు. 8 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌కు ఆ ధరను నిర్ణయించగా.. ఫిబ్రవరి 17 నుంచి ఒప్పో రెనో 7 5జీ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఒప్పో రెనో 7 ప్రో 5జీ ఫోన్ 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఈ ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 8 నుంచే ప్రారంభం కానున్నాయి. బ్లాక్, బ్లూ కలర్స్ వేరియంట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండున్నాయి.
డ్యూయల్ నానో సిమ్, ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12, 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 180 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రేర్ కెమెరా, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ వైడ్ యాంగిల్ షూటర్, 2 ఎంపీ మాక్రో షూటర్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, గైరో స్కోప్, పెడో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4500 ఎంఏహెచ్ డ్యుయల్ సెల్ బ్యాటరీ, 65 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ చార్జింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
డ్యుయల్ సిమ్ నానో, ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 180 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ఎస్వోసీ, 12 జీబీ ర్యామ్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ సెకండరీ సెన్సార్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 4500 ఎంఏహెచ్ డ్యుయల్ సెల్ బ్యాటరీ, 65 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.