Oppo Find X5 | ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి మరో బెస్ట్ ఫోన్ రానుంది. ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 సిరీస్ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మారిసిలికాన్ ఎక్స్ ఇమేజింగ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనే ఫోటోగ్రఫీ ఫీచర్తో రానుంది.
ఫిబ్రవరి 24న వర్చువల్ ఈవెంట్ ద్వారా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ఫోన్ను లాంచ్ చేయనుంది. బ్లాక్, వైట్ కలర్లలో ఫైండ్ ఎక్స్5, ఫైండ్ ఎక్స్5 ప్రో వేరియంట్లలో రానుంది.
6.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరల్ 1 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ రేర్ కెమెరా ప్రైమరీ సెన్సార్, 50 ఎంపీ సెకండరీ, 13 ఎంపీ టెర్షియరీ సెన్సార్, 32 ఎంపీ ఫ్రండ్ కెమెరా, మారిసిలికాన్ ఎక్స్ ఏఐ చిప్, 2440 ఎంఏహెచ్ డ్యుయల్ సెల్ బ్యాటరీతో ఒప్పో ఫైండ్ ఎక్స్5 రానున్నట్టు తెలుస్తోది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రో మాత్రం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ బిల్డ్ లాంటి ఫీచర్లతో రానుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రో.. 12 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ.1,02,300 గా ఉండగా.. ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 5జీ ఫోన్ ధర రూ.85,000 గా ఉండనున్నట్టు తెలుస్తోంది.