OPPO A5 Pro 5G | తక్కువ బడ్జెట్లోనే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ ఫోన్ మీకోసమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లు కలిగిన ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందజేస్తున్నాయి. అందులో భాగంగానే గతంలో ఫ్లాగ్ షిప్ ఫోన్లలోనే లభించిన వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను చాలా వరకు కంపెనీలు ప్రస్తుతం తమ మిడ్ రేంజ్ ఫోన్లలోనే అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒప్పో కూడా లేటెస్ట్గా ఇలాంటి ఓ స్మార్ట్ ఫోన్‌నే లాంచ్ చేసింది. ఎ5 ప్రొ 5జి పేరిట ఒప్పో లాంచ్ చేసిన ఈ ఫోన్ లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఒప్పో ఎ5 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తున్నాయి. అందువల్ల స్క్రీన్ క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ నాణ్యతను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ అంత సులభంగా పగలదు. ఈ ఫోన్ ఐపీ66, 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కలిగి ఉంది. 18 రకాల ద్రవాలు పడినా ఫోన్ డ్యామేజ్ అవనంత పకడ్బందీగా దీన్ని తయారు చేశారు. వేడి చల్లని ద్రవాలు ఏవి మీద పడినా ఫోన్ అంత సులభంగా డ్యామేజ్ అవదు. ఈ ఫీచర్‌ను ఈ ఫోన్‌కు ఉన్న ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
ఒప్పో ఎ5 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌కు గాను గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 2 మెగాపిక్సల్ మోనో క్రోమ్ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5800 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్ 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే కలర్ ఓఎస్ 15 ఇందులో లభిస్తుంది.
ఈ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఏర్పాటు చేశారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తోంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఒప్పో ఎ5 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌ను ఫెదర్ బ్లూ, మోకా బ్రౌన్ రంగుల్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో స్టోర్, అన్ని ప్రధాన రిటెయిల్ ఔట్‌లెట్స్‌లో ప్రస్తుతం విక్రయిస్తున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకు కార్డులతో 10 శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్‌ను (రూ.1500 వరకు) పొందవచ్చు. అలాగే 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.