OnePlus Pad Lite | కరోనా నుంచి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ల వినియోగం పెరిగింది. ఉద్యోగులు అయితే తమ పనికోసం, విద్యార్థులు అయితే చదువు కోసం ట్యాబ్‌లను ఎక్కువగా వినియోగించడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే తయారీ కంపెనీలు కూడా ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ట్యాబ్‌లను తక్కువ ధరలకే అందిస్తున్నాయి. ఇక ఇదే కోవలో వన్ ప్లస్ కూడా లేటెస్ట్గా ఓ నూతన ట్యాబ్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ పేరిట ఓ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించడమే కాదు, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 11 ఇంచుల ఎల్సీడీ. డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. కనుక డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ట్యాబ్‌కు గాను బ్రైట్ నైస్‌ను 500 నిట్స్ వరకు అందిస్తున్నారు. అందువల్ల సూర్యకాంతిలోనూ ట్యాబ్‌ను స్పష్టంగా చూసేందుకు వీలు కలుగుతుంది. ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ హీలియో జి100 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఎల్టీఈ ఆప్షన్ కూడా ఉంది. సిమ్ వేసుకుంటే 4జి సేవలను పొందవచ్చు. ఈ ట్యాబ్‌లో ముందు, వెనుక వైపు 5 మోగాపిక్సల్ కెమెరాలను అందిస్తున్నారు. 9340 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఈ ట్యాబ్‌కు లభిస్తుంది. అందువల్ల ట్యాబ్‌ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ ను ఫుల్ చార్జింగ్ చేస్తే నిరంతరాయంగా 11 గంటల పాటు వీడియోలను చూసుకోవచ్చు. ఈ ట్యాబ్‌లో క్వాడ్ స్పీకర్లను అందిస్తున్నారు. అందువల్ల ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. ముఖ్యంగా సినిమాలను వీక్షించేటప్పుడు, సంగీతం వినేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు అద్భుతమైన సౌండ్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ ట్యాబ్‌కు స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల యూజర్లు తమ వన్ ప్లస్ ఫోన్‌తో ఈ ట్యాబ్‌కు సులభంగా కనెక్ట్ అయి ఆపరేట్ చేసుకోవచ్చు. దీని సహాయంతో రెండు డివైస్‌లలోనూ క్లిప్‌బోర్డ్ షేర్ అవుతుంది. దీని వల్ల కంటెంట్ లేదా ఫైల్స్‌ను సులభంగా ఒక డివైస్ నుంచి మరొక డివైస్‌కు కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు. వన్ ప్లస్ ఫోన్‌కు, ఈ ట్యాబ్ కు కనెక్ట్ అయితే పలు కామన్ ఫీచర్లు, సర్వీసులు ఎల్లప్పుడూ సింక్ అవుతాయి. అందువల్ల యూజర్ ఎప్పుడు ఏ డివైస్‌ను కావాలనుకుంటే ఆ డివైస్‌లో మరొక డివైస్‌లో ఉన్న ఫైల్స్‌ను, యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. యాపిల్ డివైస్‌లలో ఉండే ఎకో సిస్టమ్ మాదిరిగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇక ఈ ట్యాబ్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు.
వన్ ప్లస్ ప్యాడ్ లైట్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను ఎరో బ్లూ కలర్ ఆప్షన్లో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.15,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఎల్టీఈ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఈ ట్యాబ్‌పై లాంచింగ్ కింద డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. రూ.1వేయి, రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్లను రెండు మోడల్స్‌పై పొందవచ్చు. దీంతో ఈ ట్యాబ్‌లను రూ.12,999, రూ.14,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. వీటిపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌ను వన్ ప్లస్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఆగస్టు 1 నుంచి విక్రయించనున్నారు.