న్యూఢిల్లీ : భారత్‌లో రూ 5000లోపు ధరతో వన్‌ప్లస్ నార్డ్ వాచ్ లాంఛ్ అయింది. ఈ వాచ్‌తో వన్‌ప్లస్ భారత్‌లో అఫర్డబుల్ వాచ్ సెగ్మెంట్లో ఎంటరైంది. ఈ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్, స్లీపింగ్ ప్యాట్రన్స్, స్టెప్స్ వంటి యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌తో పది రోజుల బ్యాటరీ లైఫ్ యూజర్లు పొందవచ్చని వన్‌ప్లస్ పేర్కొంది.
భారత్‌లో రూ 4999కు అందుబాటులో ఉండే వన్‌ప్లస్ నార్డ్వాచ్ ఇప్పటికే సేల్‌లో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్‌లతో పాటు ఎంపిక చేసిన వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌లో లభిస్తుంది. అక్టోబర్ 4 నుంచి అమెజాన్‌లో సేల్ షురూ అవుతుంది.
యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ 500 ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ 1.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, హెచ్డీ రిజల్యూషన్‌ను కలిగిఉంది. రెక్టాంగిల్ డయల్, సిలికాన్ స్ట్రాప్స్‌తో స్మార్ట్‌వాచ్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. నార్డ్ వాచ్ 105 ఫిట్నెస్ మోడ్స్‌ను కలిగిఉంది.