OnePlus Nord CE 3 Lite | ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ లాంఛ్.. బడ్జెట్ ఫోన్ ప్రత్యేకతలివే..!
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite) ఏప్రిల్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఏప్రిల్ 4న ఈ మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కానుండగా లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite) ఏప్రిల్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఏప్రిల్ 4న ఈ మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కానుండగా లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు వెల్లడయ్యాయి. ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌తో పాటు గీక్‌బెంచ్ డేటాబేస్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు లిస్టయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది.
నార్డ్ సీఈ లైట్ సిరీస్‌ను రూ. 20,000లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల టార్గెట్‌గా తీసుకురానుండగా లేటెస్ట్ వెర్షన్ కూడా ఇదే ధరల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యాం ఆప్షన్‌నూ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌లో 6.7 ఇంచ్ డిస్ప్లేతో రానుంది.
ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ వెనుకభాగంలో 108 ఎంపీ కెమెరా ఆకట్టుకోనుంది. ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2 ఎంపీ సెన్సర్లు ఉంటాయి. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 67డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. రూ. 20,000లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ స్ధాయి బ్యాటరీ సామర్ధ్యం అరుదుగా కనిపిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో లాంఛ్ అవుతుందా లేదా అనే వివరాలపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Read More :
Apple | భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనున్న యాపిల్
ChatGPT | చాట్‌జీపీటీ ప్రత్యామ్నాయంపై ఐఐటీ మద్రాస్ కసరత్తు : ప్రాంతీయ భాషలపై ఫోకస్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

