న్యూఢిల్లీ : లేటెస్ట్ ఫీచర్లు, అందుబాటు ధరలో వన్‌ప్లస్ 11ఆర్‌ను వచ్చే ఏడాది ప్రధమార్ధంలో వన్‌ప్లస్ లాంఛ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌ను ప్రముఖ టెక్ నిపుణులు మ్యాక్స్ జంబర్ లీక్ చేశారు. వన్‌ప్లస్ 11ఆర్ మూడు కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కస్టమర్ల ముందుకు రానుందని వెల్లడించారు.
వన్‌ప్లస్ 10ఆర్కు కొనసాగింపుగా రానున్న వన్‌ప్లస్ 11ఆర్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో ఆకట్టుకోనుంది. ఇక వన్‌ప్లస్ 11ఆర్ ఫ్రంట్ కెమెరా 10ఆర్‌ను పోలి ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 11ఆర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ 100డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో రానుంది.
లేటెస్ట్ వన్‌ప్లస్ 11ఆర్ కర్వ్డ్ 6.7 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుంది. 2023 ప్రధమార్ధంలో మార్కెట్లోకి రానున్న వన్‌ప్లస్ 11ఆర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగిఉన్న తొలి వన్‌ప్లస్ ఫోన్‌గా కంపెనీ పేర్కొంది.