OnePlus 11 : వన్‌ప్లస్ 11 లేటెస్ట్ లీక్స్..హాట్ ఫీచర్లు ఇవే..!
వన్‌ప్లస్ 10కి కొనసాగింపుగా వన్‌ప్లస్ 11 వచ్చే ఏడాది ప్రధమార్ధంలో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ 11 న్యూ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కలిగిఉంటుందని కంపెనీ నిర్ధారించింది.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 10కి కొనసాగింపుగా వన్‌ప్లస్ 11 వచ్చే ఏడాది ప్రధమార్ధంలో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ 11 న్యూ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కలిగిఉంటుందని కంపెనీ నిర్ధారించింది. ఇక వన్‌ప్లస్ 11 ఎప్పుడు లాంఛ్ అవుతుందనేది కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించకున్నా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై లీకులు వెల్లడయ్యాయి. లీకుల ఆధారంగా వన్‌ప్లస్ 11 రెండు కలర్ ఆప్షన్స్‌లో కస్టమర్ల ముందుకు రానుంది.
వన్‌ప్లస్ 11 బ్లాక్, గ్లాసీ గ్రీన్ కలర్స్‌లో రానుందని టెక్ నిపుణులు మ్యాక్స్ జంబోర్ అంచనా వేశారు. భారత్‌లోనూ ఇవే కలర్ ఆప్షన్స్ ఉంటాయని వెల్లడైంది. ఇక వన్‌ప్లస్ 10 కంటే వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ ఖరీదు కొంచెం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 11 మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో వన్‌ప్లస్ 10 ధరను కంపెనీ తగ్గించవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక వన్‌ప్లస్ 11 కీలక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..క్యూహెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 ఎంపీ టెలిఫొటో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకొస్తుందని లేటెస్ట్ లీక్స్ వెల్లడించాయి. కంపెనీకి చెందిన ఆక్సిజన్ఓఎస్ 13తో కూడిన ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై వన్‌ప్లస్ 11 రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- leak
- OnePlus 11
- specifications
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

