వన్‌ప్లస్ 11 ఫస్ట్‌లుక్ రిలీజ్ : ఆకట్టుకునే సర్క్యులర్ కెమెరా, అలర్ట్ స్లైడర్
భారత్‌లో ఫిబ్రవరి 10న వన్‌ప్లస్ 11 లాంఛ్ కానుండగా చైనా మార్కెట్లో జనవరి 4న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. అఫిషియల్ లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ 11 డిజైన్, ఫీచర్లు సహా పలు వివరాలను కంపెనీ నిర్ధారించింది.
న్యూఢిల్లీ : భారత్‌లో ఫిబ్రవరి 10న వన్‌ప్లస్ 11 లాంఛ్ కానుండగా చైనా మార్కెట్లో జనవరి 4న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. అఫిషియల్ లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ 11 డిజైన్, ఫీచర్లు సహా పలు వివరాలను కంపెనీ నిర్ధారించింది. వన్‌ప్లస్ రిలీజ్ చేసిన అధికారిక ఫొటోల్లో వన్‌ప్లస్ 11 కంప్లీట్ రియర్ ప్యానెల్ డిజైన్ కనిపించింది. కంపెనీ వెల్లడించిన ఫొటోల్లో ఒక మోడల్ గ్రీన్ కలర్లో కనువిందు చేసింది.
మరో మోడల్ శాండ్‌స్టోన్ ఫినిష్‌తో ఆకట్టుకుంది. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కలర్స్‌తో పాటు ఫస్ట్‌లుక్‌లో వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. అలర్ట్ స్లైడర్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్టు ఫస్ట్‌లుక్‌లో వెల్లడైంది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు సెన్సర్లతో వన్‌ప్లస్ 11 కస్టమర్ల ముందుకు రానుంది.
టాప్ క్లాస్ కెమరా పెర్ఫామెన్స్‌ను అందించేందుకు హ్యాసిల్బ్లాద్తో చేతులు కలిపినట్టు కంపెనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక వన్‌ప్లస్ 11 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌లో సైడ్ కర్వ్స్‌తో స్లీక్ డిజైన్‌తో వన్‌ప్లస్ 11 స్టైలిష్ లుక్‌లో కనిపించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

