OnePlus 10 Pro : వన్‌ప్లస్ 10 ప్రొ ప్రీ-రిజిస్ట్రేషన్ షురూ కాగా న్యూ వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ వివరాలను జనవరి 4న కంపెనీ వెల్లడించనున్నారు. న్యూ వన్‌ప్లస్ ఫోన్ల ప్రీ రిజిస్ట్రేషన్ చైనాలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ వెబ్సైట్ జేడీ.కాంలో ప్రారంభమయ్యాయి. వన్‌ప్లస్ 10 సిరీస్ జనవరిలో లాంఛ్ కానుండగా దీనికి సంబంధించిన వివరాలను జనవరి 4న వన్‌ప్లస్ ప్రకటించనుంది.
తాజా ఫోన్లతో వన్‌ప్లస్ ఫిబ్రవరిలో లాంఛ్ కానున్న షియోమి 12 అల్ట్రా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా వంటి స్మార్ట్ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది. ఇక వన్‌ప్లస్ 10 ప్రొ భారత్ మార్కెట్లో రూ 60,000 నుంచి రూ 70,000 మధ్య అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 10 ప్రొ స్క్రీన్ కోసం ఎల్టీపీఓ 2.0 టెక్నాలజీని వినియోగించారు. ఈ టెక్నాలజీతో వన్‌ప్లస్ 10 ప్రొ స్క్రీన్ థిన్నర్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. 6.7 ఇంచ్ డయాగ్నల్ డిస్ప్లే క్యూహెచ్డీ+, అమోల్డ్ స్క్రీన్‌తో రానుంది.
వన్‌ప్లస్ 10 ప్రొ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో 12జీబీ ర్యాం, 265జీబీ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ లెన్స్ సెటప్ రియర్ పానెల్‌పై ఒక వైపున స్క్వేరిష్ కెమెరా మాడ్యూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది.