Now or Nothing Sale | మీరు నథింగ్ కు చెందిన స్మార్ట్ ఫోన్ లేదా ఇతర ఏ ప్రొడక్ట్స్ అయినా కొనాలని చూస్తున్నారా..? అయితే ఈ గొప్ప సదవకాశం మీకోసమే. నథింగ్ కంపెనీ ప్రత్యేకంగా నౌ ఆర్ నథింగ్ పేరిట ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నథింగ్‌కు చెందిన ఫోన్లతోపాటు ఇతర ప్రొడక్ట్స్‌ను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా నథింగ్ స్మార్ట్ ఫోన్లు, ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్ హెడ్సెట్, చార్జర్లు, స్మార్ట్ వాచ్‌లు, కేబుల్స్‌ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా జూన్ 15వ తేదీ వరకు కొనసాగనుంది.
నథింగ్ నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఫోన్ 3ఎ స్మార్ట్ ఫోన్‌ను రూ.22,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే 3ఎ ప్రొ ఫోన్ అయితే రూ.26,999 ధరకు లభిస్తుంది. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రొ స్మార్ట్ ఫోన్‌ను రూ.17,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే నథింగ్ ఇయర్ ఎ బడ్స్‌ను రూ.5,499 ధరకు కొనవచ్చు. నథింగ్ ఇయర్ బడ్స్‌ను రూ.8,499 ధరకు అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా నథింగ్‌కు చెందిన పలు యాక్ససరీలపై కూడా రాయితీలను అందిస్తున్నారు. సీఎంఎఫ్ కేబుల్స్‌తోపాటు, 140 వాట్ల చార్జర్‌ను రూ.3,499 ప్రారంభ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ ఉత్పత్తులపై పలు బ్యాంకు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే మరింత రాయితీని పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినట్స్, మింత్రా, విజయ్ సేల్స్, క్రోమా, ఇతర ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లో ఈ సేల్ అందుబాటులో ఉంది.
కాగా ఈ సేల్‌లో భాగంగా సీఎంఎఫ్ బడ్స్‌ను రూ.1,999 ధరకు, సీఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రొను రూ.1899కు, సీఎంఎఫ్ బడ్స్ ప్రొను రూ.2,499కు, సీఎంఎఫ్ బడ్స్ ప్రొ 2ను రూ.3,499కు కొనుగోలు చేయవచ్చు. సీఎంఎఫ్ వాచ్ ప్రొను రూ.2,999 ధరకు, సీఎంఎఫ్ వాచ్ ప్రొ 2 ను రూ.4,199కు అందిస్తున్నారు. 100 వాట్ల నథింగ్ చార్జర్ ధర రూ.2,999 ఉండగా, 140 వాట్ల చార్జర్ ధర రూ.3,499గా ఉంది. 33వాట్ల సీఎంఎఫ్ చార్జర్ ధర రూ.999గా ఉంది. 65 వాట్ల చార్జర్‌ను రూ.2,499కు, 45 వాట్ల చార్జర్‌ను రూ.2,299కు అందిస్తున్నారు. ఇంకా మరెన్నో సీఎంఎఫ్, నథింగ్ ఉత్పత్తులపై ఆకట్టుకునే రాయితీలను అందిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది.