Nokia G22 | ఫిన్లాండ్ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. ఐఫిక్సిట్తో కలిసి నోకియా జీ22 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. వారంటీ పీరియడ్ దాటిన తర్వాత డిస్ప్లే దెబ్బ తిన్నా, చార్జింగ్ పోర్ట్ వంగిపోయినా, బ్యాటరీ పని చేయకపోయినా రీప్లేస్ చేస్తారు. తక్కువ ధరకే విడి భాగాల రీప్లేస్మెంట్ చేస్తుంది. రెండు వేరియంట్లలో నోకియా జీ22 వస్తున్నది. 6 జీబీ రామ్ (4జీబీ +2జీబీ వర్చువల్ రామ్)తోపాటు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో నోకియా జీ22 వస్తోంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో కూడా వస్తున్నది. దీని ధర 179 యూరోలు (దాదాపు రూ.15,700). మార్చి 8 నుంచి బ్రిటన్‌తోపాటు ఎంపిక చేసిన యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో లభిస్తుంది. భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందన్న సంగతి వెల్లడించలేదు.