న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో ఆకర్షణీయ ఫీచర్లతో నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. హిందీ లాంగ్వేజ్ సపోర్ట్, ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ సహా ఇతర హెల్త్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ రూ 5499 ప్రారంభ ధరకు లభ్యమవుతుందని, ప్రారంభ ఆఫర్ ముగిసిన తర్వాత రూ 7,999కి అందుబాటులో ఉంటుందని ప్రముఖ వేరబుల్స్ కంపెనీ నాయిస్ వెల్లడించింది.
కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌వాచ్‌లను ఆధునీకరిస్తున్నామని నాయిస్ సహ వ్యవస్ధాపకుడు గౌరవ్ ఖత్రి తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ నాయిస్, ప్లిఫ్కార్ట్తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్ట్స్లోనూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కొద్దికాలంలోనే నాయిస్ భారత్‌లో ఫేవరెట్ స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా ఎదిగిందని చెప్పారు. నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 స్మార్ట్‌వాచ్ చార్కోల్ బ్లాక్, క్లౌడ్ గ్రే, రోజ్ పింక్ కలర్స్‌లో లభిస్తుందని తెలిపారు.
ఇక స్మార్ట్‌వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే..నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 వాచ్ 1.2 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్‌తో రౌండ్ డయల్, లైట్‌వెయిట్ అల్యూమినియం బాడీతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ ప్రత్యేకతతో అరగంట చార్జ్ చేస్తే ఐదు రోజులపాటు బ్యాటరీ పనిచేస్తుంది. 80 నిమిషాల చార్జింగ్‌తో ఏకంగా వారంరోజులు పనిచేస్తుంది. ఎస్పీ02 మానిటర్, 13 స్పోర్ట్ మోడ్స్, హార్ట్‌రేట్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటర్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వాక్ రిమైండర్, హైడ్రేషన్ రిమైండర్ వంటి పలు హెల్త్ ఫీచర్లను పొందుపరిచారు.