WhatsApp Ghost Pairing | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సామాజిక మాధ్యమం ‘వాట్సాప్’ వినియోగదారులపై కొత్త తరహా సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) ఆందోళన వ్యక్తం చేసింది. ‘వాట్సాప్’లో వచ్చే లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సీఎస్బీ డైరెక్టర్ శిఖా గో యెల్ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
క్రోమ్ అటాక్
ఏవైనా హానికరమైన వెబ్సైట్లను సందర్శించినప్పుడు లేదా వాటిని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు వాటిలోని లోపాలను ఉపయోగించుకుని వినియోగదారుల బ్యాంక్ పాస్వర్డ్లు, ఇతర వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు దొంగిలిస్తారు.
ఘోస్ట్ పెయిరింగ్
హ్యాకర్లు వాట్సాప్లో మోసపూరిత సందేశాలను పంపి, ఆ లింకుల ద్వారా వాట్సాప్ కోడ్ను పొందుతారు. దీని ద్వారా ఆ వాట్సాప్ ఖాతాను వారి పరికరానికి లింక్ చేసుకుని చాట్లను రహస్యంగా గమనిస్తుంటారు. ఈ ప్రక్రియలో వినియోగదారుని వాట్సాప్ ఖాతా మామూలుగానే పనిచేస్తుంది. కానీ, ఆ వినియోగాదారుని సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్తుంది.
సైబర్ దాడులను నిరోధించాలంటే..