అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికీ అత్యుత్తమంగా చెప్పుకునేది చంద్రుడిపై మానవులు అడుగు పెట్టడం గురించే. అమెరిక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ మిషన్‌ను విజయవంతంగా ముగించిన తర్వాత.. చాలా దేశాలు మానవులను చంద్రుడిపై సొంతంగా పంపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ముందుగా మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్‌లను పంపుతున్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండవ్వాలనేది కూడా సమస్యగానే మారింది. దీనికి నాసా తాజాగా సమాధానం చెప్పింది.
దీనికోసం చందమామపై మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది. త్వరలోనే ఆర్టిమిస్ III మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపే యోచనలో నాసా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసేందుకు చందమామ దక్షిణ ధ్రువం సమీపంలో 13 ప్రాంతాలను గుర్తించింది. చంద్రుడిపై ఆర్టిమిస్ నౌక 6.5 రోజులు ఉంటుంది. ఈ సమయం మొత్తం పగలు ఉండేలా ఈ ప్రాంతాలను గుర్తించారు. చంద్రుడిపై చీకటి చాలా గాఢంగా ఉంటుంది. దానిలో ఏమి ఉన్నా మనకు కనిపించదు. అందుకే సూర్యకాంతి ప్రతినిమిషం ఉండే ప్రాంతాలను నాసా గుర్తించింది.
The 13 candidate landing regions for the #Artemis III mission were identified based on different criteria that help to ensure a safe landing and achieve science objectives.
@NASA will continue to discuss the regions with the scientific community. https://t.co/xucAnMQZqf pic.twitter.com/4U9dThyMHx— NASA Artemis (@NASAArtemis) August 19, 2022