న్యూఢిల్లీ : మోటోరోలో మోటో జీ71 లాంఛ్‌పై ఈ నెలాఖరులో ప్రకటన చేయనుండగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇవేనంటూ పలు వివరాలు లీకయ్యాయి. మోటో జీ71 5జీ కనెక్టివిటీతో 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌ను ఆఫర్ చేయనుంది. ఇది 2.2జీహెచ్‌జడ్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.