motorola moto book 60 Pro | మోటోరోలా కంపెనీ మోటో బుక్ సిరీస్‌లో పలు నూతన ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటో బుక్ 60 ప్రొ పేరిట ఈ ల్యాప్ టాప్ లను విడుదల చేశారు. ఈ ల్యాప్ టాప్‌లు చాలా తక్కువ బరువును కలిగి ఉండడం విశేషం. కేవలం 1.39 కిలోల బరువును మాత్రమే ఇవి కలిగి ఉన్నాయి. అలాగే మెటల్ బాడీ, మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో వీటిని రూపొందించారు. అందువల్ల ల్యాప్ టాప్ లకు ప్రీమియం లుక్ వచ్చింది. తక్కువ బరువు ఉంటాయి కనుక ప్రయాణాల్లోనూ చాలా సులభంగా ఈ ల్యాప్ టాప్‌లను తీసుకెళ్లవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రాంజ్ గ్రీన్, వెడ్జ్ వుడ్ కలర్ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేశారు. వీటిల్లో 14 ఇంచుల ఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 2.8కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. కనుక డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ల్యాప్ టాప్ల డిస్ప్లేకు గాను 1100 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల సూర్యకాంతిలోనూ డిస్ప్లేను స్పష్టంగా వీక్షించవచ్చు. ఈ ల్యాప్ టాప్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లను అందిస్తున్నారు. కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ ఉన్న మోడల్లో 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ లభిస్తుండగా, కోర్ అల్ట్రా 7 మోడల్ ల్యాప్ టాప్‌లో 32జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్ టాప్లలో 60 వాట్ అవర్ బ్యాటరీని అందిస్తున్నారు. వీటికి తోడుగా లభించే చార్జర్ 65 వాట్ల కెపాసిటీని కలిగి ఉంటుంది. కనుక ల్యాప్ టాప్ లను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను యూఎస్బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. ఇక ఈ ల్యాప్ టాప్ లలో వైఫై 7, బ్లూటూత్ 5.4, ఫుల్ హెచ్డీ 1080పి వెబ్ కెమెరా, ప్రైవసీ షటర్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ ల్యాప్ టాప్లలో విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2024 ఎడిషన్‌ను ఈ ల్యాప్ టాప్లలో అందిస్తున్నారు. ఈ రెండు వేరియెంట్లలోనూ ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్‌ను అందిస్తున్నారు. వీటికి డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. అందువల్ల సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. నాణ్యమైన ఆడియోను ఆస్వాదించవచ్చు. యూఎస్బీ టైప్ సి తోపాటు హెచ్డీఎంఐ, మైక్రోఎస్డీ, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను వీటిల్లో అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లకు 1 ఏడాది పాటు వారంటీని ఇస్తున్నారు.
మోటోరోలా మోటోబుక్ 60 ప్రొకు చెందిన ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ మోడల్ ల్యాప్ టాప్ ధర రూ.64,990 ఉండగా, మోటోరోలా మోటోబుక్ 60 ప్రొ కోర్ అల్ట్రా 7 మోడల్ ల్యాప్ టాప్ ధర రూ.80,990గా ఉంది. ఈ ల్యాప్ టాప్‌లను మోటోరోలా ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు. వీటిపై బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీని వల్ల రూ.59,990 ప్రారంభ ధరకు వీటిని కొనుగోలు చేయవచ్చు.