Moto e22s | మార్కెట్లోకి మోటరోలా లోబడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్ మోటో ఈ22ఎస్.. రూ. 8,999లకే లభ్యం
Moto e22s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. దేశీయ మార్కెట్లోకి లో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్ మోటో ఈ22ఎస్ తెచ్చింది.
Moto e22s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత మార్కెట్లోకి లో బడ్జెట్ 4జీ- స్మార్ట్ ఫోన్ మోటో ఈ22ఎస్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 8,999గా నిర్ణయించారు. ఇందులో మీడియా టెక్ చిప్సెట్ లభ్యం అవుతుంది. ఈ వారం ప్రారంభంలో మోటో ఈ22ఎస్ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది.
మోటో ఈ22 ఫోన్లో డ్యుయల్ కెమెరా సెటప్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేస్తుంది. ఇటీవల మార్కెట్లోకి మోటరోలా కంపెనీ.. మోటో ఈ32, మోటో ఈ32ఎస్ ఫోన్లను ఆవిష్కరించింది. మోటో ఈ 32 ఫోన్ రూ.10,499లకు, ఈ32ఎస్ ఫోన్ రూ.9,999లకు లభిస్తాయి.
మోటో ఈ22ఎస్ ఫోన్ రూ. 8,999లకు లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఈ నెల 22 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో విక్రయిస్తారు. ఈ ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్‌గా కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. 4జీబీ రామ్ ప్లస్ 64జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో పొందొచ్చు. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ రంగుల్లో లభ్యం అవుతుంది.
మోటో ఈ22ఎస్ ఫోన్ 90హెర్ట్జ్ డిస్ప్లేతో వస్తున్నది. స్టైలిష్ ప్రీమియం డిజైన్, 16 ఎంపీ ఏఐ కెమెరా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని మోటరోలా ట్వీట్ చేసింది. ఆండ్రాయిడ్ 12 వర్షన్‌తోపాటు ఫలు ఫీచర్లు జత చేసినట్లు పేర్కొంది.
మోటో ఈ22ఎస్ ఫోన్ ఫోర్ ఏ53 2.3జీహెచ్‌జడ్, ఫోర్ ఏ53 1.8జీహెచ్‌జడ్ కోర్స్‌తో కూడిన మీడియా టెక్ హెలియో జీ37 ఓక్టాకోర్ సీపీయూ ఫీచర్ జత చేశారు. ప్రాసెసర్‌ను 4జీ రామ్‌తో తయారు చేశారు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. ఒక టిగా బైట్ డేటా వాడుకునే సామర్థ్యం గల మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్కూడా లభ్యం అవుతుంది.
మోటో ఈ22ఎస్ ఫోన్లో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ పానెల్ విత్ 1600×720 రిజొల్యూషన్ సామర్థ్యం ఉంటుంది. ప్రైమరీ లెన్స్ 16 ఎంపీ కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ సామర్థ్యంతో వస్తుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. ఇది 10వాట్ల చార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్‌గా ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల వరకు వాడుకోవచ్చునని మోటరోలా చెబుతున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

