న్యూఢిల్లీ : భారత్‌లో మొటోరోలా మోటో జీ72 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. మోటో జీ72 6.6 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మోటో జీ72 6జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ 18,999 కాగా లాంఛ్ సందర్భంగా మోటో జీ72ను కంపెనీ రూ 14,999కే ఆఫర్ చేస్తోంది. స్లిమ్ ప్రొఫైల్ లైట్ వెయిట్ డిజైన్‌తో మోటో జీ72ను తేలికగా హ్యాండిల్ చేయవచ్చు.
ఈ డివైజ్ మీడియాటెక్ హెలియో జీ99 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను కలిగిఉంది. బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కలిగిఉంది. మోటో జీ72 గ్రే, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.