Meta | మాస్ లేఆఫ్స్ అనంతరం బోనస్ చెల్లింపుల్లో కోత
రెండో దశ మాస్ లేఆఫ్స్‌లో భాగంగా మెటా (Meta) ఇటీవల 10,000 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా పలువురు ఉద్యోగుల బోనస్ చెల్లింపుల్లో కోత విధించేందుకు కంపెనీ సన్నహాలు చేపట్టింది.
న్యూయార్క్ : రెండో దశ మాస్ లేఆఫ్స్‌లో భాగంగా మెటా (Meta) ఇటీవల 10,000 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా పలువురు ఉద్యోగుల బోనస్ చెల్లింపుల్లో కోత విధించేందుకు కంపెనీ సన్నహాలు చేపట్టింది. 2022 నవంబర్‌లో ఫేస్బుక్ మాతృ సంస్ధ మెటా ఏకంగా 11,000 మందిని తొలగించింది.
ఆర్ధిక మందగమనం, మాంద్య భయాలతో ఈ ఏడాది పలువురు ఉద్యోగులకు తక్కువగా బోనస్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. రెండేండ్లకు ఒకసారి ఉద్యోగుల సామర్ధ్యాన్ని సమీక్షించేందుకు సన్నద్ధమవుతోంది. గత ఏడాది ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా తమ సామర్ధ్య సమీక్ష ప్రక్రియలో మార్పులు చేపట్టామని, ఈ మార్పులకు ఉద్యోగుల పునర్వ్యవస్ధీకరణతో సంబంధం లేదని మెటా ప్రతినిధి పేర్కొన్నారు.
ఇక ఈ నెల ఆరంభంలో మెటా ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత, కంపెనీలో నియామకాలు,అంతర్గత బదిలీలు తిరిగి ప్రారంభమవుతాయని లేఆఫ్స్ సమయంలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇక మెటాతో పాటు అమెజాన్, గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు మారిన స్ధూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో లేఆఫ్స్‌కు తెగబడ్డాయి.
Read More :
Layoffs | భారత్‌లో ఇంజనీరింగ్ టీంపై గిట్‌హబ్ వేటు
ChatGPT | చాట్‌జీపీటీతో ఊడనున్న కొలువు ఇదే..: ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వెల్లడి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- bonus
- layoffs
- Meta
- technology news
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

