ChatGPT | చాట్‌జీపీటీతో ఊడనున్న కొలువు ఇదే..: ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వెల్లడి
లాంఛ్ అయిన కొద్దినెలలకే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన చాట్‌జీపీటీ (ChatGPT) పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
న్యూఢిల్లీ : లాంఛ్ అయిన కొద్దినెలలకే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన చాట్‌జీపీటీ (ChatGPT) పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సంక్లిష్ట సమస్యలనూ ఇట్టే పరిష్కరిస్తున్న ఈ ఏఐ టూల్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. చాట్‌జీపీటీ రాకతో ఏఐ ఆధారిత టూల్స్‌తో కొలువుల కోత తప్పదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
రాబోయే రోజుల్లో చాట్‌జీపీటీ వినియోగం పెరిగితే పలు ఉద్యోగాలు ఊడతాయనే చర్చ ఊపందుకుంది. అయితే చాట్‌జీపీటీతో మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయనే వివరాలతో ఈ ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ ముందుకొచ్చారు. పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రైడ్మన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్ట్మాన్ ఏఐ చాట్‌బాట్ గురించి కీలక వివరాలు వెల్లడించారు.
వైరల్ చాట్‌బాట్‌తో పలు ఉద్యోగాలకు ముప్పు తప్పదని సామ్ అంగీకరించారు. త్వరలోనే కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలను చాట్‌జీపీటీ తుడిచిపెట్టేస్తుందని బాంబు పేల్చారు. అతిత్వరలోనే కస్టమర్ సర్వీస్ విభాగంలో ఉద్యోగాలు కనుమరుగవుతాయని తాను అంచనా వేస్తున్నానని సామ్ చెప్పుకొచ్చారు.
మనుషులు చేసే పలు రకాల ఉద్యోగాలను ఏఐ చేపడుతుందని, అయితే ఈ మార్పు ఎంత త్వరగా వస్తుందనేదే తనను కలిచివేస్తోందని అంతకుముందు ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ సామ్ ఆల్ట్మాన్ పేర్కొన్నారు. అయితే మానవులు అంతులేని సృజనాత్మకతను కలిగిఉంటారని, తాము చేసేందుకు కొత్త విషయాలను కనుగొంటారని వ్యాఖ్యానించారు.
Read More :
Satya Nadella | ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక సూచన
Viral Post | కంటి వ్యాధులను పసిగట్టే యాప్ క్రియేట్ చేసిన 11 ఏండ్ల బాలిక
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

