Lenovo Idea Tab | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు 5జి సదుపాయం కలిగిన ట్యాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసమే లెనోవో ఓ నూతన ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఐడియా ట్యాబ్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ట్యాబ్‌లో 11 ఇంచుల డిస్ప్లే ఉండగా దీనికి 2.5కె రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 256జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ట్యాబ్ పనిచేస్తుంది. దీనికి గాను 2 ఓఎస్ అప్గ్రేడ్లను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది.
లెనోవో ఐడియా ట్యాబ్‌లో 5జి, వైఫై వేరియెంట్లను అందిస్తున్నారు. 5జి అవసరం లేదనుకుంటే వైఫై వేరియెంట్‌ను కొనుగోలు చేయవచ్చు. అదే 5జి వేరియెంట్‌ను తీసుకుంటే సిమ్ వేసుకుని 5జి సేవలను పొందవచ్చు. ఈ ట్యాబ్‌కు గాను ఫోలియో కీబోర్డును అందిస్తున్నారు. అవసరం అనుకుంటే వినియోగదారులు దాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే ట్యాబ్‌కు ఓ స్టైలస్‌ను కూడా ఇస్తున్నారు. దీని సహాయంతో ట్యాబ్ ను ఉపయోగించడం చాలా సులభతరం అవుతుంది. ఈ ట్యాబ్‌లో టర్బో సిస్టమ్ టెక్‌ను అందిస్తున్నారు. అందువల్ల గతంలో వచ్చిన లెనోవో ట్యాబ్‌లతో పోలిస్తే ఈ ట్యాబ్ 19 శాతం వేగంగా పనిచేస్తుందని, దీని వల్ల యాప్‌లు, గేమ్‌లను చాలా వేగంగా ఓపెన్ చేయవచ్చని, ఎలాంటి ల్యాగ్ కూడా ఉండదని కంపెనీ చెబుతోంది. ట్యాబ్‌ను వేగంగా ఆపరేట్ చేసుకోవచ్చని తెలియజేసింది.
ఈ ట్యాబ్‌లో డాల్బ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. అందువల్ల సౌండ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. నాణ్యమైన ఆడియోను వినవచ్చు. అలాగే 7040 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ట్యాబ్‌లో పలు ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. లెనోవో ఏఐ నోట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లను యూజర్లు పొందవచ్చు. ఈ ట్యాబ్‌లో స్టోరేజ్‌ను మెమొరీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. 5జి సేవలను పొందవచ్చు. 4జీ ఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం ఈ ట్యాబ్ లో అందిస్తున్నారు.
లెనోవో ఐడియా ట్యాబ్‌కు చెందిన వైఫై (విత్ పెన్) వేరియెంట్ ధర రూ.16,999 ఉండగా, 5జి (విత్ పెన్) వేరియెంట్ ధర రూ.19,999గా ఉంది. లెనోవో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో వినియోగదారులు ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు.