Lava Shark 5G | చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రస్తుతం అతి తక్కువ ధరకే 5జి ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఆయా ఫోన్లలో ఆకట్టుకునే ఫీచర్లను కూడా అందిస్తున్నారు. 5జి ఫోన్ బడ్జెట్లో కావాలంటే గతంలో కనీసం రూ.15వేలు వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.10వేల లోపే అందుబాటులో ఉంటున్నాయి. అందులో భాగంగానే తాజాగా లావా కంపెనీ కూడా మరో నూతన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. షార్క్ 5జి పేరిట లావా విడుదల చేసిన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.75 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఇక ఈఫోన్లో ఆక్టాకోర్ యూనిసోక్ టి765 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా 4జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. మరో 4జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా ఇందులో పొందవచ్చు. లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ స్టైలిష్ గ్లాసీ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. కనుక ఈ ఫోన్‌ను చూస్తే ప్రీమియం లుక్ వస్తుంది. చాలా స్లీక్ డిజైన్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ ఫోన్ చక్కని ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను అందిస్తున్నారు.
ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 10 వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను బాక్స్‌తో సహా అందిస్తున్నారు. ఈ ఫోన్లో 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. స్టోరేజ్‌ను మెమొరీ కార్డు ద్వారా 512 వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను పక్క భాగంలో అమర్చారు. ఐపీ 54 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైపై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లో పొందవచ్చు.
లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ స్టెల్లార్ గోల్డ్, స్టెల్లార్ బ్లూ వేరియెంట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. బడ్జెట్ ధరలో లభిస్తున్న లేటెస్ట్ 5జి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. అన్ని రిటెయిల్ ఔట్లెట్స్తోపాటు లావా ఇ-స్టోర్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను కొన్న వారికి ఉచిత హోమ్ సర్వీస్‌ను అందిస్తున్నారు.