Lava Play Max | మొబైల్స్ తయారీదారు లావా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్లే మ్యాక్స్ పేరిట ఈ ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ప్లే సిరీస్‌లో లేటెస్ట్గా వచ్చిన లావా మొబైల్స్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో 5జి సేవలను సైతం అందిస్తున్నారు. ఈ ఏడాది ప్లే అల్ట్రా ఫోన్‌ను లావా విడుదల చేయగా ఇప్పుడు ప్లే మ్యాక్స్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.72 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్ కు గురికాదు. దీని వల్ల బీజీఎంఐ లాంటి గేమ్స్‌ను సైతం చాలా ఎక్కువ సేపు ఫోన్ వేడెక్కకుండా ఆడుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. స్టోరేజ్‌ను ఎస్డీకార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుందని ఎలాంటి బ్లోట్ వేర్ లేదని కంపెనీ తెలియజేసింది. ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. ఐపీ 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి సదుపాయాలు సైతం ఇందులో ఉన్నాయి.
లావా ప్లే మ్యాక్స్ ఫోన్‌ను డెక్కన్ బ్లాక్, హిమాలయన్ వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అన్ని లావా రిటెయిల్ ఔట్ లెట్స్ లో విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఇది ఇతర అన్ని లావా ఫోన్లకు సైతం వర్తిస్తుంది.