Lava Agni 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. భారత్ మార్కెట్లోకి లావా అగ్ని2 5జీ (Lava Agni 2 5G) ఫోన్ ఆవిష్కరించింది. 2021 నవంబర్‌లో ఆవిష్కరించిన లావా అగ్ని 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా లావా అగ్ని2 5జీ (Lava Agni 2 5G) తీసుకొచ్చింది. కర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 5జీ ఎస్వోసీ (Octa-core MediaTek Dimensity 7050 5G SoC) చిప్సెట్తో వస్తున్నది. బ్యాక్ ప్యానెల్‌పై బిగ్ సర్క్యులర్ మాడ్యుల్లో క్వాడ్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సింగిల్ విరిడియాన్ కలర్.. 8జీబీ రామ్ విత్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ తో వస్తున్నది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో సేల్స్ ప్రారంభం అవుతుంది. దీని ధర రూ.21,999గా ఖరారు చేశారు. ఏదేనీ ప్రధాన బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే లావా అగ్ని2 5జీ ఫోన్ రూ.19,999లకు లభిస్తుంది.
డ్యుయల్ నానో సిమ్-సపోర్టెడ్ లావా అగ్ని2 5జీ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2220×1080 పిక్సెల్స్ రిజొల్యూషన్). కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్.
ఎర్గోనొమిక్ 3డీ డ్యుయల్ కర్వ్డ్ డిజైన్ డిస్ ప్లే టూ సపోర్ట్ హెచ్డీఆర్(HDR), హెచ్డీఆర్ 10 (HDR 10), హెచ్డీఆర్ 10 + (HDR 10+). డబుల్-రీఇన్ ఫోర్స్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, మ్యాట్టి ఫినిష్ విత్ 3డీ గ్లాస్ బ్యాక్ డిజైన్ విత్ 2.3 మి.మీ బాటమ్ బెజెల్.
ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ ప్రాసెసర్. భారత్ మార్కెట్లో ఒక స్మార్ట్ ఫోన్లో వాడుతున్న తొలి ప్రాసెసర్ ఇది.
ఆండ్రాయిడ్ 13 ఔట్ ఆఫ్ ది బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్ల వరకు ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 వర్షన్ అప్ డేటేషన్ విత్ సెక్యూరిటీ అప్ డేట్స్.
క్వాడ్ కెమెరా యూనిట్ ఎట్ ది బ్యాక్ 50-మెగా పిక్సెల్ 1.0-మైక్రాన్ కెమెరా సెన్సర్. వెల్లడి కాని ఇతర కెమెరా సెన్సర్ల వివరాలు.
యూజర్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ పెంపుదలకు ఎక్స్-యాక్సిస్ లినియర్ మోటార్ హ్యాప్టిక్స్.
8 జీబీ రామ్ కలిగి ఉంటుంది. వర్చువల్ గా 16జీబీ రామ్ విస్తరణకు మద్దతుగా ఉంటుంది. 256 జీబీ రామ్ ఇన్ బిల్ట్ స్టోరేజీ.
4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 66 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్. 16 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్.