e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News Flipkart Big Billion Days Sale : ఈ అర్ధరాత్రితో ముగియనున్న సేల్.. లాస్ట్ మినట్ డీల్స్ ఇవే

Flipkart Big Billion Days Sale : ఈ అర్ధరాత్రితో ముగియనున్న సేల్.. లాస్ట్ మినట్ డీల్స్ ఇవే

ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ ఈరోజు అర్ధ‌రాత్రితో ముగియ‌నుంది. అక్టోబ‌ర్ 2న ప్రారంభ‌మైన సేల్‌.. అక్టోబ‌ర్ 10 వ‌ర‌కు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రికొన్ని గంట‌ల్లో సేల్ ముగియ‌నుండ‌గా.. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్, ఇత‌ర ప్రొడ‌క్ట్స్ మీద బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది.

ఐఫోన్ 12, గూగుల్ పిక్సెల్ 4ఏ ఫోన్ల ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుదారులకు అద‌న‌పు డిస్కౌంట్ ల‌భించ‌నుంది. అలాగే.. రియ‌ల్‌మీ ఎక్స్‌7, అసుస్ ఆర్ఓజీ ఫోన్ 5, జియోమీ ఎంఐ 10టీ 5జీ ఫోన్ల ధ‌రల‌ను ఫ్లిప్‌కార్ట్ త‌గ్గించింది.

Google Pixel 4a

- Advertisement -

6జీబీ ప్ల‌స్ 128 జీబీ మోడ‌ల్ గూగుల్ పిక్సెల్ 4ఏ ఫోన్ ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,999. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డుదారులు..అద‌న‌పు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ కూడా వ‌ర్తిస్తుంది. 5.81 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 12.2 ఎంపీ రేర్ కెమెరా, 3140 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 730జీ ఎస్‌వోసీ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Realme X7

ఈ ఫోన్ ఎంఆర్పీ ధ‌ర రూ.19,999. కానీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌కే ఈ ఫోన్ ల‌భిస్తుంది. 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ఎస్‌వోసీ, 64 ఎంపీ కెమెరా, 4310 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 50డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

Asus ROG Phone 5

అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 8 జీబీ ప్ల‌స్ 128 జీబీ ధ‌ర రూ.49,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ డీల్‌లో భాగంగా ప‌లు ఆఫ‌ర్లు ల‌భించ‌నున్నాయి. 6.78 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్‌, క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 888 ఎస్‌వోసీ, ఎయిర్‌ట్రిగ్గ‌ర్ 5, డుయ‌ల్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీక‌ర్స్‌, మ‌ల్లీ యాంటీనా వైఫై, క్వాడ్ మైక్ నాయిస్ క్యాన్సెలేష‌న్ అర్రే లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

iPhone 12

ఐఫోన్ 12 64 జీబీ మోడ‌ల్ ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.52,999. 6.1 ఇంచ్ స్క్రీన్‌, 5జీ క‌నెక్టివిటీ లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. అలాగే.. ఐఫోన్ 12 మినీపై కూడా ధ‌ర త‌గ్గించారు. అద‌న‌పు డిస్కౌంట్ల‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్లు కూడా ఈ ఫోన్ ద్వారా ల‌భించ‌నున్నాయి.

Xiaomi Mi 10T 5G

6 జీబీ ర్యామ్ ప్ల‌స్ 128 జీబీ మోడ‌ల్ జియోమీ ఎంఐ 10టీ 5జీ ఫోన్ ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.32,999. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, క్వాల్‌క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ఎస్‌వోసీ, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, రేర్ కెమెరా సెట‌ప్, 64 ఎంపీ కెమెరా, 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Windows 11 : విండోస్‌ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?

Jio Offer | నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న యూజ‌ర్ల‌కు జియో బంప‌ర్ ఆఫ‌ర్‌

Telegram | వాట్సాప్ డౌన్‌.. పండ‌గ చేసుకున్న టెలిగ్రామ్‌.. భారీగా కొత్త యూజ‌ర్లు

OnePlus 9RT : త్వరలో భారత మార్కెట్‌లోకి వ‌న్‌ప్ల‌స్ 9ఆర్‌టీ.. ఫీచ‌ర్లు ఇవే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement