Twitter | న్యూయార్క్: యూట్యూబర్లు, ఫేస్బుక్ కంటెంట్ క్రియేటర్లకు ఎక్స్ (ట్విట్టర్) కంపెనీ శుభవార్త చెప్పింది. వీడియోలను అప్లోడ్ చేసి ట్విట్టర్లోనూ డబ్బులు సంపాదించవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కొన్ని షరతులతో కొత్త యాడ్ రెవెన్యూ పాలసీని తీసుకొచ్చింది. బ్లూ టిక్ ఉన్నవారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని తెలిపింది. 3 నెలల వ్యవధిలో అప్లోడ్ చేసిన కంటెంట్‌కు 1.5 కోట్ల వ్యూస్ పొందడంతో పాటు 500 మంది ఫాలోవర్లు ఉన్నవారు బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ కోసం నగదు చెల్లిస్తే ఆ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. జూలై చివరి వారం నుంచి ఈ పాలసీని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది.