శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Science-technology - Feb 25, 2020 , 17:42:55

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్‌

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు ఐక్యూ.. ఐక్యూ 3 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది.  ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.44 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 180 హెడ్జ్‌ సూపర్‌ టచ్‌ రెస్పాన్స్‌ రేట్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ముందు భాగంలో 16 మెగాపిక్సల్‌ పంచ్‌ హోల్‌ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 865 అధునాత ప్రాసెసర్‌, 12 జీబీ వరకు ర్యామ్‌ తదితర పవర్‌ఫుల్‌ ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కార్బన్‌ ఫైబర్‌ వీసీ లిక్విడ్‌ కూలింగ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేసినందున ఈ ఫోన్‌లో గేమ్స్‌ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు ఫోన్‌ ఎక్కువగా హీట్‌కు గురి కాకుండా ఉంటుంది. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరా, 13 మెగాపిక్సల్‌ టెలిఫొటో లెన్స్‌, 13 మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2 మెగాపిక్సల్‌ డెప్త్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీని సహాయంతో ఫోన్‌ను కేవలం 0.29 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్‌ చేసుకోవచ్చు. 

ఈ ఫోన్‌ బ్యాక్‌ కేస్‌కు గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 4440 ఎంఏహెచ్‌ బ్యాటరీకి 55 వాట్ల ఫ్లాష్‌ చార్జ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్‌ను కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ 5జి వేరియెంట్‌లోనూ లభిస్తున్నది. ఐక్యూ 3 4జీ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.36,990 ఉండగా, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.39,990గా ఉంది. అలాగే 5జి 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.44,990గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఐక్యూ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. ఈ సందర్భంగా ఐసీఐసీఐ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.3వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే నో కాస్ట్‌ ఈఎంఐ విధానంలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 

ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు... 

  • 6.44 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 
  • 2400 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
  • 2.84 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌
  • 8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌ 
  • ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌ 
  • 48, 13, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు 
  • 16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా 
  • ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 5జి/4జి
  • బ్లూటూత్‌ 5.1, యూఎస్‌బీ టైప్‌ సి
  • 4440 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ ఫ్లాష్‌ చార్జ్‌ 


logo