iPhone SE 4 | స్టైలిష్ డిజైన్, భారీ డిస్ప్లేతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 4..ధర ఎంతంటే..!
ఐఫోన్ 6, ఇతర ఐఫోన్ పాత వెర్షన్లలో చూసిన బోరింగ్ టచ్ ఐడీ డిజైన్‌ను యాపిల్ పక్కనపెట్టింది. నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ మోడరన్ డిజైన్‌తో పాటు భారీ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : ఐఫోన్ 6, ఇతర ఐఫోన్ పాత వెర్షన్లలో చూసిన బోరింగ్ టచ్ ఐడీ డిజైన్‌ను యాపిల్ పక్కనపెట్టింది. నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ మోడరన్ డిజైన్‌తో పాటు భారీ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. లేటెస్ట్ ఐఫోన్ ఎస్ఈ భారీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ ఎక్స్ఆర్ను పోలిన డిజైన్‌తోనే ఐఫోన్ ఎస్ఈ 4 ఉంటుందని టెక్ నిపుణులు జాన్ ప్రాసర్ అంచనా వేశారు. ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగా ఐఫోన్ ఎస్ఈ 4 బ్రాడ్ నాచ్, వెనుక వైపు సింగిల్ కెమెరా ఉంటుందని జాన్ ప్రాసర్ లీక్ చేశారు.
ఐఫోన్ ఎస్ఈ 4 ఐఫోన్ 13 ఇతర ఫ్లాగ్షిప్ వెర్షన్ల తరహాలో 6.1 ఇంచ్ డిస్ప్లే కలిగిఉంటుంది. యాపిల్ ఇటీవల లాంఛ్ చేసిన ఎస్ఈ ౩ కాంపాక్ట్ డిస్ప్లే, చిన్న బ్యాటరీతో రావడంతో సేల్స్ నిరాశాజనకంగా ఉండటంతో డిస్ప్లేలో మార్పులు చేసినట్టు సమాచారం. ఐఫోన్ ఎస్ఈ 3 పాత మోడల్‌ను పోలిఉండటం భారత్‌లో అధిక ధరకు విక్రయించడంతో కూడా యాపిల్‌కు మెరుగైన ఫీడ్‌బ్యాక్ లభించలేదు. అందుకే ఐఫోన్ ఎస్ఈ 4 డిజైన్, డిస్ప్లేలో భారీ అప్‌గ్రేడ్‌కు యాపిల్ మొగ్గుచూపింది.
కస్టమర్లను ఆకట్టుకునేలా పలు మార్పులు చేయడంతో స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ పెంచే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ3ను భారత్‌లో రూ 43,900కు లాంఛ్ చేయడంతో ఐఫోన్ ఎస్ఈ 4 ధర మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ ఎస్ఈ 4 యాపిల్ ఓల్డ్ ఏ15 చిప్‌ను కలిగిఉంటుందా లేక ఐఫోన్ 14 సిరీస్‌లో వాడిన ఏ16 ఎస్ఓసీ చిప్సెట్తో ముందుకొస్తుందా అనేది వెల్లడి కాలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

