న్యూఢిల్లీ : 2024లో మనం అడుగుపెట్టగా అప్పుడే ఈ ఏడాది ఐఫోన్‌పై (iPhone 16) రూమర్లు కూడా రోజుకో తీరుగా గుప్పుమంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కస్టమర్ల ముందుకొస్తుందని భావిస్తున్న ఐపోన్ 16పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సరికొత్త చిప్సెట్ నుంచి వీడియోలను క్యాప్చర్ చేసేందుకు డెడికేటెడ్ బటన్ వరకూ ఈ క్రేజీ ఫోన్ ఫీచర్లపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక న్యూ ఐఫోన్ భారీ డిస్ప్లే సైజ్‌తో పాటు భారీ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుందని చెబుతున్నారు. రానున్న ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ భారీ స్క్రీన్‌తో దాదాపు 6.3 ఇంచ్, 6.9 ఇంచ్ డిస్ప్లేతో ఉంటాయని మాక్రుమర్స్ రిపోర్ట్ పేర్కొంది. ఇక ఐఫోన్ గత మోడల్స్‌తో పోలిస్తే డిస్ప్లే సైజ్ పెరగడంతో న్యూ మోడల్స్ అధిక పొడవు, వెడల్పుతో ఉంటాయని భావిస్తున్నారు.
భారీ డిస్ప్లేలతో పాటు ప్రొ మోడల్స్‌లో న్యూ క్యాప్చర్ బటన్‌ను ఐపోన్ 16 సిరీస్‌లో టెక్ దిగ్గజం ప్రవేశపెడుతుందని చెబుతున్నారు. ఈ బటన్ ఫోన్ కుడి వైపున అమర్చుతారు. ఈ బటన్‌ను లైట్‌గా ప్రెస్ చేస్తే ఫొటోలను క్లిక్ చేస్తుంది..ఆపై హార్డ్‌గా ప్రెస్ చేస్తే వీడియో రికార్డింగ్ బిగిన్ అవుతుంది. ఇక ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌లో కనిపించిన యాక్షన్ బటన్‌ను ఐఫోన్ 16లోనూ యాపిల్ కొనసాగించనుంది.
Read More :