న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లాంఛ్ కానున్న యాపిల్ ఐఫోన్ 15 అల్ట్రా ధర ఆన్లైన్లో లీకైంది. ప్రతి ఏటా న్యూ జనరేషన్ ఫోన్ ఎంట్రీ ఇచ్చిన కొద్దివారాలకే తదుపరి జనరేషన్ ఐఫోన్లకు సంబంధించి ఆన్లైన్లో లీకులు వస్తున్న క్రమంలో వచ్చే ఏడాదిలో రానున్న ఐఫోన్ 15 సిరీస్‌పైనా పలు లీకులు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 15 అల్ట్రా ధర ఏకంగా 1299 డాలర్ల (రూ.1,07,000) ప్రారంభ ధర ఉంటుందని లీక్స్యాపిల్ప్రొ వర్గాలు వెల్లడించాయి.
ఐఫోన్ ప్రొ మ్యాక్స్ మోడల్‌ను ఐఫోన్ అల్ట్రాగా యాపిల్ మార్చింది. పాత మోడల్‌తో పోలిస్తే 200 డాలర్ల మేరకు యాపిల్ ధరను పెంచడంతో అల్ట్రా ధర భారమైందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు కలిపితే ఐఫోన్ 15 అల్ట్రా ధర భారత్‌లో మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.
భారత్‌లో లాంఛ్ అయిన ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ధర రూ .1,39,900 కాగా ఇదే ప్రొడక్ట్ అమెరికాలో 1099 డాలర్లకు (రూ. 90,810)కు అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 ప్రొ వేరియంట్లు ఐఫోన్ 14 ప్రొ మోడల్స్ తరహాలో న్యూ డైనమిక్ ఐలండ్ ఫీచర్‌తో రానున్నాయి. ఇక చవక మోడల్స్‌లో పాత చిప్సెట్తో ఐఫోన్ 15 సిరీస్ రానుండగా ప్రొ, అల్ట్రా వేరియంట్స్ న్యూ యాపిల్ ఏ17 బయోనిక్ చిప్‌ను కలిగిఉంటాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.