న్యూఢిల్లీ : యాపిల్ తన పలు ఐఫోన్లకు ఒకే డిజైన్ బ్లూప్రింట్‌ను వాడుతుండగా తాజాగా న్యూ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేపడుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రానున్న ఐఫోన్ 15 సరికొత్త బోర్డర్ డిజైన్‌తో పాటు పలు ఇతర మార్పులతో కస్టమర్ల ముందుకు వస్తుందని లేటెస్ట్ లీకులు వెల్లడించాయి.
ఐఫోన్ 15 న్యూ బోర్డర్ డిజైన్‌తో రానుందని టెక్ నిపుణులు ష్రింప్యాపిల్ప్రొ ట్విట్టర్ వేదికగా అంచనా వేశారు. గత ఐఫోన్ 12, ఐఫోన్ 13. ఐఫోన్ 14లో మనం చూసిన స్వ్కేర్డ్ ఎడ్జ్ల స్ధానంలో ఐఫోన్ 15 కర్వ్డ్ ఎడ్జ్‌తో రానుందని, ఈ హాట్ డివైజ్‌కు యాపిల్ టైటానియం బిల్డ్ మెటీరియల్‌ను వాడనుందని కూడా తాజా లీక్‌లో వెల్లడైంది.
ఈ మెటీరియల్ ఖరీదు కావడంతో ఐఫోన్ 15 ధర కూడా అధికంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఇక ఐఫోన్ 15, ప్లస్ మోడల్ డైనమిక్ ఐలండ్ ఫీచర్‌ను స్టాండర్డ్ మోడల్స్ డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగిఉంటాయని ఇప్పటికే పలు లీకులు అంచనా వేశాయి. ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ-సీ పోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుందని చెబుతున్నారు. టెక్ అనలిస్ట్ మింగ్ చి కూ అంచనాల ప్రకారం ఐఫోన్ 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్ మోడల్స్ సాలిడ్ స్టేట్ బటన్ డిజైన్‌తో రానున్నాయని తెలిసింది.