న్యూఢిల్లీ : యాపిల్ 14 ప్రొ ప్రపంచవ్యాప్తంగా పలు స్టోర్స్‌లో స్టాక్ లేదనే సమాచారం వస్తోంది. యాపిల్ అధికారిక స్టోర్స్‌లోనూ యాపిల్ లేటెస్ట్ ఫోన్ అందుబాటులో లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు. హ్యాండ్సెట్స్ ప్రొడక్షన్‌కు మించి ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతోనే ఈ పరిస్ధితి నెలకొందని మార్కెట్ విశ్లేషకులు, టెక్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మోడల్స్‌కు వెయిటింగ్ టైమ్ 25 రోజులకు పెరిగింది. 30 దేశాల్లో ఐఫోన్ లభ్యతను ట్రాక్ చేసే గణాంకాల ఆధారంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌ల వెయిటింగ్ టైమ్‌ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్‌కు చెందిన అనలిస్ట్ డేవిడ్ వోట్ అంచనా వేశారు. ఈ హాట్ డివైజ్‌ల వెయిటింగ్ టైమ్ తాజాగా 5 రోజుల నుంచి 25 రోజులుక ఎగబాకిందని వెల్లడించారు. ఇక ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని స్టోర్స్‌లో ఐఫోన్ 14 ప్రొ కొరతపై యాపిల్‌తో మాట్లాడానని ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల పేర్కొన్నారు.
సరఫరా సమస్యలను అధిగమించేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. భారత్‌లో ఐఫోన్ ప్రొడక్షన్ ముమ్మరంగా చేపట్టడం ద్వారా ఐఫోన్ 14 డిమాండ్‌ను అందుకోవడంపైనా తాను యాపిల్‌తో మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భారత్‌లో ఐఫోన్ 14 అసెంబ్లింగ్‌ను యాపిల్ తైవాన్ కాంట్రాక్ట్ తయారీ కంపెనీ పెగాట్రాన్ కార్ప్ ప్రారంభించిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.