న్యూఢిల్లీ : ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ సేల్ సరైన అవకాశంగా ముందుకొచ్చింది. ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌పై రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 తరహాలోనే అవే స్పెసిఫికేషన్స్‌తో ఐఫోన్ 14 ప్లస్ ముందుకొచ్చింది. ఏ15 బయోనిక్ చిప్ ఇంప్రూవ్డ్ వెర్షన్ ప్రాసెసర్‌తో ఐఫోన్ 14 ప్లస్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
ఇక ఐఫోన్ 14 ప్లస్ ఒరిజినల్ ప్రైస్ రూ. 89,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 76,999కి సేల్‌లో ఉంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఐఫోన్ 14 ప్లస్‌ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది ఐఫోన్ 14 స్సెసిఫికేషన్స్ను కలిగిఉంది. రెండు స్మార్ట్ఫోన్ల మధ్య డిస్ప్లే సైజ్‌లోనే భారీ వ్యత్యాసం గమనించవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 6.7 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లే కలిగిఉంది. తక్కువ ధరలో భారీ డిస్ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ఇష్టపడే వారికి ఐఫోన్ 14 ప్లస్ మేలైన ఎంపికని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 14 ప్లస్ 12 ఎంపీ, 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్‌తో మెరుగైన కెమెరా సామర్ధ్యం కలిగిఉంది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ఐఓఎస్ అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతాయి.