iPhone 14 | ఐఫోన్ 14.. యాపిల్ ఫోన్ లవర్స్ ఎదురు చూస్తోంది దీనికోసమే. గత సంవత్సరమే ఐఫోన్ 13 విడుదలైంది. నిజానికి ఐఫోన్ 13 విడుదల కాకముందే ఐఫోన్ 14 ఫీచర్ల గురించి సోషల్ మీడియాలో చర్చ నడిసింది. ఐఫోన్ 13 కూడా హైఎండ్ స్పెసిఫికేషన్లతో విడుదల అయినప్పటికీ ఐఫోన్ 13లో లేని ఎన్నో బెస్ట్ ఫీచర్లను ఐఫోన్ 14లో తీసుకొచ్చేందుకు యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 120 హెచ్‌జెడ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్‌తో ఐఫోన్ 14 రానున్నట్టు తెలుస్తోంది.
ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 మినీ ఫోన్లు రానున్నాయి. కొన్ని నెలల్లో ఐఫోన్ 14 లాంచ్ కోసం యాపిల్ సంస్థ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఐఫోన్ 14 ఫీచర్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. ముఖ్యంగా కెమెరా విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 14 రానున్నట్టు తెలుస్తోంది.
120 హెచ్‌జెడ్ అనేది హైరిజల్యూషన్. ప్రోమోషన్ డిస్ప్లేతో ఐఫోన్ 14 రానున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 14 ప్రోలో 8జీబీ ర్యామ్ ఉంటుందట. మిగితా మోడల్స్‌లో మాత్రం 6జీబీ ర్యామ్ ఉంటుందట. ఐఫోన్ 14 ప్రోలో 48 ఎంపీ కెమెరా, 12 ఎంపీ సెన్సార్స్ ఉండనున్నాయి. అలాగే.. అన్ని ఐఫోన్ 14 మోడల్స్ 128 జీబీ నుంచి 256 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉండనున్నాయి.
వచ్చే సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న ఐఫోన్ 14 మోడల్స్‌లో 6.1 ఇంచ్ డిస్ప్లేతో ఐఫోన్ 14, 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఐఫోన్ 14, 6.1 ఇంచ్ డిస్ప్లేతో ఐఫోన్ 14 ప్రో, 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు విడుదల కానున్నాయి. ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ 48 ఎంపీ కెమెరాతో రిలీజ్ కానున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఏ16 బయోనిక్ చిప్సెట్తో పాటు 4ఎన్ఎమ్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లు ఐఫోన్ 14లో ఉండనున్నాయి.