iPhone 14 | ఐఫోన్ 14 మ్యాక్స్ లాంఛ్ వాయిదా!
ఐఫోన్ 14 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ అవుతుందనే అంచనాలు వెల్లడవుతుండగా అధికారికంగా యాపిల్ లాంఛ్ డేట్‌ను వెల్లడించలేదు.
న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ అవుతుందనే అంచనాలు వెల్లడవుతుండగా అధికారికంగా యాపిల్ లాంఛ్ డేట్‌ను వెల్లడించలేదు. ఐఫోన్ 14 సిరీస్‌పై పలు లీక్‌లు వెల్లడవుతుండగా తాజాగా ప్రీమియర్ మోడల్ ఐఫోన్ 14 మ్యాక్స్‌కు సప్లయి చైన్ సమస్యలు ఎదురవుతున్నట్టు సమాచారం. ఈ వార్తలు నిజమైతే ఐఫోన్ 14 మ్యాక్స్ విడుదల మరి కొద్దివారాలు వాయిదాపడవచ్చని చెబుతున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ వంటి నాలుగు మోడల్స్‌ను లాంఛ్ చేస్తుండగా తక్కువ ధరలో ప్రొ మోడల్స్ ఫీచర్లను అందించే ఐఫోన్ 14 మ్యాక్స్ కోసం కస్టమర్లు ఉత్కంఠగా వేచిచూస్తున్నారు. మిని మోడల్ స్ధానాన్ని ఐఫోన్ 14 మ్యాక్స్ భర్తీ చేయనుంది. దీంతో ఈ ఏడాది ఐఫోన్ 14 మినీ ఎంట్రీ ఉండదు. ఇక ఐఫోన్ 14 మ్యాక్స్‌కు సప్లయి చైన్ సమస్యలు వెంటాడుతుండటంతో ఈ మోడల్ ప్రొడక్షన్ నెమ్మదించినట్టు టెక్ నిపుణులు రాస్ యంగ్ పేర్కొన్నారు.
దీంతో ఐఫోన్ 14 మ్యాక్స్ రిలీజ్ షెడ్యూల్ కంటే మరికొద్ది వారాలు జాప్యం కావచ్చని చెబుతున్నారు. ఐఫోన్ 14 మ్యాక్స్ డిస్ప్లే ప్యానెల్స్ సరఫరాలో కొరతతో ప్రొడక్షన్ దెబ్బతింటోందని యంగ్ తాజా ట్వీట్లో పేర్కొన్నారు. ప్రొ మ్యాక్స్ మోడల్ ప్రొడక్షన్‌పై మాత్రం సప్లయి చైన్ ఇబ్బందుల ప్రభావం లేదని చెప్పారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

