న్యూఢిల్లీ : ఐఫోన్ 14ను సొంతం చేసుకోవాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఛాన్స్‌గా ఫ్లిప్‌కార్ట్ డీల్ ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు ఆఫర్లో ఉన్నాయి. రూ . 79,900 పలికే ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌పై రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇక యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా రూ. 21,400 వరకూ క్యాష్‌బ్యాక్ లభించడంతో ఐఫోన్ 14 మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఇక రూ. 89,900 విలువైన ఐఫోన్ 14 ప్లస్ ప్లిఫ్కార్ట్పై కేవలం రూ. 75,999కే లిస్టయింది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో డ్రీం ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకునే వెసులుబాటు ఉంది. ఐఫోన్ 14 ఫీచర్ల విషయానికి వస్తే 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో హెచ్డీఆర్ సపోర్ట్, ఫేస్ ఐడీ సెన్సర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
ఐఫోన్ 14 ఏ15 బయోనిక్ చిప్సెట్తో 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్‌పై రన్ అవుతుంది. 5జీ కనెక్టివిటీతో వైఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ ఫీచర్లను కలిగిఉంది. ఐఫోన్ 14 డ్యూయల్ రియర్ కెమెరాల్లో 12 ఎంపీ ప్రైమరీ వైడ్‌యాంగిల్ సెన్సర్, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌యాంగిల్ షూటర్‌తో పాటు వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్‌ను సపోర్ట్ చేస్తుంది.