హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): క్యాబ్ డ్రైవర్ల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కోరింది. క్యాబ్ డ్రైవర్ నీలమర్రి రాజశేఖర్ హత్య, దోపిడీ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసు బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రాణాల గురించి ఆలోచించాలని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు.