iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ | దాని కోసం యాపిల్ సంస్థ సన్నాహాలు కూడా చేస్తోంది. సెప్టెంబర్ 14న ఐఫోన్ 13 సిరీస్‌ను యాపిల్ విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి
వెయిట్ ఈజ్ ఓవర్.. త్వరలోనే ఐఫోన్ 13 సిరీస్‌ను యాపిల్ కంపెనీ విడుదల చేయనుంది. ఇంకో వారంలో ఐఫోన్ 13 మార్కెట్లో విడుదల కాబోతోంది. దాని కోసం యాపిల్ సంస్థ సన్నాహాలు కూడా చేస్తోంది. సెప్టెంబర్ 14న ఐఫోన్ 13 సిరీస్‌ను యాపిల్ విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ.. దీనిపై క్లారిటీ లేదు.

అయితే.. ఇప్పటికే ఐఫోన్ 13లో ఉండే స్పెషల్ ఫీచర్స్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఐఫోన్ 13ను తయారు చేశారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఐఫోన్ 13లో ఇప్పటి వరకు ఏ సిరీస్‌లో లేని ఫీచర్.. శాటిలైట్ ఫీచర్‌ను యాడ్ చేస్తున్నారని కూడా తెలిసింది.
ఈ ఫీచర్ ద్వారా.. సెల్యూలర్ నెట్వర్క్ లేని ప్రాంతంలో కూడా కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్లో సిగ్నల్ లేకున్నా.. కాల్స్, మెసేజెస్ పంపించుకునేలా ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. నెట్ వర్క్ లేని ప్రాంతానికి వెళ్లినప్పుడు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ బాగా అవసరం ఉంటుంది.

అయితే.. ఈ ఫీచర్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోయే ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు తీసుకురావడం లేదట యాపిల్. ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉన్న ఆ ఫీచర్‌ను వచ్చే సంవత్సరం యాడ్ చేసే అవకాశం ఉందట. ఎందుకంటే.. ఆ ఫీచర్ కోసం ఓ హార్డ్‌వేర్‌ను తయారుచేస్తోందట యాపిల్ కంపెనీ. దాని తయారీ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందట. అందుకే.. దాన్ని టెస్టింగ్ కోసం కొన్ని మోడల్స్‌లో తీసుకొచ్చి.. పూర్తిస్థాయిలో అన్ని మోడల్స్‌లో కొన్ని నెలల తర్వాత తీసుకురానున్నారట.

మరోవైపు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లుగా కనిపిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్లో పోస్ట్ అయిన ఈ వీడియోలో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను చూడొచ్చు. యాపిల్ ఇంకా ఐఫోన్ 13 సిరీస్‌ను రిలీజ్ చేయకముందే.. ఈ ఫోన్లు సోషల్ మీడియాలో వైరల్ అవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అవి నిజంగా ఐఫోన్ 13 ఫోన్లేనా లేక డుప్లికేట్ ఫోన్లా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : JioPhone Next 4G : అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ డేట్ వచ్చేసింది
Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో విడుదల
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

