న్యూఢిల్లీ : మరో వారంలో ఐఫోన్ 14 ఎంట్రీ ఇవ్వనుండగా ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 128జీబీ మోడల్‌పై ఏకంగా రూ 14,000 డిస్కౌంట్ ప్రస్తుతం లభిస్తుండటంతో భారత్‌లో తమ డ్రీమ్ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు ఐఫోన్ కస్టమర్లకు ఇదే మెరుగైన అవకాశంగా చెబుతున్నారు.
దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ వర్తిస్తుండటంతో ఐఫోన్ 13 మరింత తక్కువకే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13ను రూ 65,999కి విక్రయిస్తుండగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రూ 1000 ఆఫర్ ఇస్తుండటంతో ఐఫోన్ 13 రూ 64,999కి లభిస్తోంది. వాస్తవానికి ఐఫోన్ 13 భారత్‌లో అధికారికంగా 79,990కి లభిస్తుందని యాపిల్ ఆన్లైన్ స్టోరలో లిస్టయింది.
ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసేవారికి ఐఫోన్ 13 మరింత తక్కువకే సొంతమవుతుంది. పాతన ఫోన్‌పై ఈకామర్స్ దిగ్గజం ఏకంగా రూ 19,000 వరకూ ఆఫర్ చేస్తోంది. అయితే ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ విలువను మదింపు చేస్తారు.