న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో (Flipkart Sale) ఐఫోన్ 12 భారీ డిస్కౌంట్‌పై కస్టమర్లకు అందుబాటులో ఉంది. డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కలుపుకుంటే రూ. 30,000లోపు హాట్ డివైజ్ సొంతం చేసుకునే వెసులుబాటు కలిగింది. ఐఫోన్ 12 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అధికారిక ధర రూ. 49,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 40,999కి లైవ్‌లో ఉంది.
దీనికి తోడు పలు బ్యాంక్ ఆఫర్లతో డివైజ్ ధర మరింత తగ్గుతుంది. ఇక ఐఫోన్ 12పై బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 1000 ఆఫర్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌పై ఇతర ఆఫర్ల వివరాలను కూడా చెక్ చేసుకుని రాయితీలు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లకు తోడు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఐఫోన్ 12ను రూ. 30,000లోపు సొంతం చేసుకోవచ్చు.
Read More :
OnePlus 12 | డిసెంబర్ 4న వన్‌ప్లస్ 12 గ్రాండ్ ఎంట్రీ..హాట్ డివైజ్ ఫీచర్లివే..!