Infinix Note 10: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్లను భారత్‌లో సోమవారం ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ నోట్ 10 సిరీస్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 10, నోట్ 10 ప్రొ మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. గేమింగ్ ఫోకస్డ్ ప్రాసెసర్లు, మల్టీ-రియర్ కెమెరా సెటప్‌లతో స్మార్ట్ఫోన్లు వస్తున్నాయి.
8జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ కలిగిన నోట్ 10 ప్రొ మోడల్ ధర రూ.16,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ కోసం జూన్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్ 7 డిగ్రీ పర్పుల్, 95 డిగ్రీ బ్లాక్, నార్డిక్ సీక్రెట్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ కలిగిన నోట్ 10 మోడల్ ధర రూ.10,999గా ఉంది. మరోవైపు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ విక్రయాలు జూన్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్ 7 డిగ్రీ పర్పుల్, 95 డిగ్రీ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభించనుంది.