Infinix Hot 60i 5G | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి స్మార్ట్ ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ మీ కోసమే. ఇన్ఫినిక్స్ కంపెనీ నూతనంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 60ఐ 5జి పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 6.75 ఇంచుల డాట్ ఇన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో నోటిఫికేషన్ల కోసం ప్రత్యేకంగా డైనమిక్ పోర్ట్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. అదనంగా మరో 4జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను 5 ఏళ్ల వరకు ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఏఐ ఫీచర్లను కూడా అందిస్తున్నారు. సర్కిల్ టు సెర్చ్, ఏఐ కాల్ ట్రాన్స్లేషన్, ఏఐ సమ్మరైజేషన్, ఏఐ రైటింగ్ అసిస్టెంట్, ఏఐ ఎరేజర్, ఏఐ వాల్ పేపర్ జనరేటర్ వంటి ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఫోలాక్స్ వాయిస్ అసిస్టెంట్‌ను సైతం అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు హ్యాండ్స్ ఫ్రీ ఆపరేటింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్లో నో నెట్వర్క్ కాల్ త్రూ అల్ట్రా లింక్ టెక్నాలజీని అందిస్తున్నారు. దీని సహాయంతో మొబైల్ సిగ్నల్ లేకున్నా డివైస్ల మధ్య కీలక సమచారాన్ని షేర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే 10 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లో సింగిల్ వేరియెంట్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. రెండు సిమ్ కార్డులతోపాటు ఒక మైక్రో ఎస్డీ కార్డు వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా 3 స్లాట్లను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను అందిస్తున్నారు.
ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఏర్పాటు చేశారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. డీటీఎస్ ఫీచర్‌ను అందిస్తున్నారు కనుక సౌండ్ క్వాలిటీగా ఉంటుంది. ఐపీ 64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయలను సైతం అందిస్తున్నారు. ఇన్ఫినిక్స్ హాట్ 60ఐ 5జి ఫోన్‌ను షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, ప్లమ్ రెడ్, స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,299గా ఉంది. ఈ ఫోన్‌పై లాంచింగ్ సందర్భంగా రూ.300 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో ఆగస్టు 21 నుంచి విక్రయించనున్నారు.