IIT Bombay | ఏఐ ఆధారిత స్క్రిప్ట్‌రైటింగ్ టూల్ కోసం ఈరోస్‌తో ఐఐటీ బాంబే జోడీ
ఏఐ ఆధారిత ఆటోమేటిక్ స్క్రిప్ట్‌రైటింగ్ టూల్ డిజైన్, డెవలప్మెంట్ కోసం ఈరోస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఐఐటీ బాంబే చేతులు కలుపుతోంది.
ముంబై : ఏఐ ఆధారిత ఆటోమేటిక్ స్క్రిప్ట్‌రైటింగ్ టూల్ డిజైన్, డెవలప్మెంట్ కోసం ఈరోస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఐఐటీ బాంబే చేతులు కలుపుతోంది. ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ కోసం అభివృద్ధి చేసే ఈ టూల్‌కు జపాన్‌కు చెందిన దిగ్గజ దర్శకుడు కురసోవా పేరును ఖరారు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో వినోద పరిశ్రమకు కురసోవా టూల్ సాధికారితను కల్పిస్తుందని చెబుతున్నారు. సినిమా ప్లాట్, స్క్రిప్ట్ అభివృద్ధిలో ఫిల్మ్‌మేకర్లకు ఈ సాఫ్ట్వేర్ ఉపకరిస్తుంది.
విద్యా పరిశోధనా రంగాల్లో కురసోవాపై ఐఐటీ బాంబే శ్వేతపత్రాన్ని క్రియేట్ చేయనుంది. కురసోవా టూల్‌పై ఐఐటీ బాంబే, ఈరోస్ ఏడాదికి పైగా కలిసి పనిచేస్తాయి. కస్టమైజ్డ్ స్క్రిప్ట్, సినాప్సిస్లను, మెరుగైన జోనర్ ఎంపిక వంటి అంశాల్లో కురసోవా టూల్ పిల్మ్మేకర్లకు మార్గదర్శిగా నిలవనుంది. ముందుగానే ఫీడ్ చేసిన డేటా ఆధారంగా ప్లాట్ ఎంపిక, సీన్ జనరేషన్‌ను ఈ మెషీన్ మానవ ప్రమేయం లేకుండానే ఫిల్మ్ మేకర్ల ముందుంచుతుంది.
ఐఐటీ బాంబే, ఈరోస్ ఇన్వెస్ట్మెంట్స్ మధ్య అనుబంధం కుడి, ఎడమ బ్రెయిన్ల అనుసంధానానికి అద్భుతమైన సంకేతమని ఈరోస్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ స్వనీత్ సింగ్ పేర్కొన్నారు. కురసోవా టూల్ వినోద పరిశ్రమలో సరికొత్త విప్లవం వంటిదని ఈ టూల్ స్ర్కిప్ట్రైటర్ల కోసం గ్రౌండ్‌వర్క్ చేయడంతో పాటు సృజనాత్మకత, నాణ్యతపై వారు మరింత దృష్టిసారించేలా దోహదపడుతుందని చెప్పారు. మెరుగైన సామర్ధ్యంతో స్టోరీటెల్లింగ్‌ను కొత్తపుంతలు తొక్కించడంలో కంటెంట్ క్రియేటర్లకు కురసోవా గొప్ప అవకాశమని ఐఐటీ బాంబే రీసెర్చి డెవలప్మెంట్ డీన్ ప్రొఫెసర్ మిలింద్ అట్రీ పేర్కొన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

