Earth | భూమిపైకి నీరు ఎలా వచ్చింది?.. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే..
భూమిపై నీళ్లు ఉండటం వల్లనే ఇన్ని కోట్ల ప్రాణులు జన్మించాయని చెప్తారు. అందుకే నివాసయోగ్యమైన గ్రహాలను వెతికే సమయంలో కూడా ఆయా గ్రహాలపై నీరు ఉండే అవకాశం ఉందా? అనే పరిశోధనలు చేస్తుంటారు శాస్త్రవేత్తలు. అయితే అసలు భూమిపైకి నీరు ఎలా వచ్చింది? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు జపాన్‌కు చెందిన ఒక అధ్యయనం షాకింగ్ సమాధానం చెప్పింది.
వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై పడిన ఆస్టరాయిడ్ ద్వారా నీరు ఇక్కడకు వచ్చి ఉండొచ్చని జపనీస్ పరిశోధకులు అంటున్నారు. ర్యూగు అనే ఆస్ట్రరాయిడ్ వల్లనే నీరు భూమిపైకి వచ్చిందని వెల్లడించారు. ‘‘త్వరగా ఆవిరయ్యే స్వభావం ఉండే వొలటైల్, ఆర్గానిక్ భరిత సి-టైప్ ఆస్టరాయిడ్స్ వల్లనే భూమిపై నీరు ఏర్పడి ఉండొచ్చు’’ అని ఈ అధ్యయనం పేర్కొంది.
అయితే ఇలా ఆస్టరాయిడ్స్ ద్వారానే ఈ ఆవిరయ్యే పదార్థాలు చేరాయని వందశాతం చెప్పలేమని, దీనిపై మరింత పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- asteroids
- Earth
- Telugu News
- water
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

