e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home టాప్ స్టోరీస్ హోట‌ల్ రూంలో స్పై కెమెరా ఉంద‌ని అనుమానామా? ఈ ట్రిక్స్‌తో క‌నిపెట్టేయొచ్చు

హోట‌ల్ రూంలో స్పై కెమెరా ఉంద‌ని అనుమానామా? ఈ ట్రిక్స్‌తో క‌నిపెట్టేయొచ్చు

How to Detect Hidden Cameras | సెలవుల్లో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటాం. పండుగైన, పార్టీలైనా, పెండ్లిళ్లైనా, శుభకార్యాలైనా కొత్త బట్టలు కొంటుంటాం.. ఏదో పనిపై బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాష్‌రూంలు, టాయిలెట్లు వాడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలను అనుకూలంగా మార్చుకొని రెచ్చిపోతున్నారు కొందరు కీచకులు. గుట్టుచప్పుడు కాకుండా స్పై, హిడెన్‌ కెమెరాలు పెట్టి ఫొటోలు, వీడియోలు, మనవాళ్లతో ప్రైవేటుగా ఉన్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. కొన్ని హోటల్స్‌, షాపింగ్‌మాల్స్‌, ఇతర పబ్లిక్‌ ప్రదేశాల్లో అక్కడి ఉద్యోగులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గోవా పర్యటనలో కేంద్ర మంత్రి స్మృతిఇరానీకి సైతం ఓ సారి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని వన్‌ డ్రైవ్‌ ఫుడ్‌కోర్టు రెస్టారెంట్‌ లేడీస్‌ టాయిలెట్‌లో ఓ హౌస్‌కీపింగ్‌ బాయ్‌ ఫోన్‌ పెట్టి ప్రైవేటు దృశ్యాలను రికార్డు చేస్తున్నట్టు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది.

పరిసరాలను గమనించండి

 • హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు వాష్‌రూంలు వాడే సమయంలో జాగ్రత్త తప్పనిసరి. పరిసరాలను నిశితంగా గమనించాలి.
 • ట్రయల్‌ రూములు, హోటల్‌ గదుల్లో గోడలు, మూలలపై, స్విచ్‌బోర్డులు, ఫ్యాన్లు, బల్బు హోల్డర్లు, పూల కుండీలు, అలంకరణ వస్తువులు, గోడ గడియారాలు, డెస్క్‌ టేబుళ్లు, టేబుల్‌ ల్యాంప్‌లు, ఫొటో ఫ్రేమ్‌లు, స్విచ్‌బోర్డుల్లోని స్క్రూలు ఇలా అన్నీ స్పై కెమెరాలు దాచేందుకు అనువైన ప్రదేశాలే. వాటిని నిశితంగా పరిశీలించాలి. ఏవైనా చిన్న రంధ్రాలు ఉన్నట్టు గుర్తిస్తే అక్కడ సీక్రెట్‌ కెమెరా ఉన్నట్టు అనుమానించాలి.
 • హిడెన్‌ కెమెరా కనిపిస్తే కంగారు పడకుండా పోలీసులకు సమాచారం అందించాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దు. అలా తాకడం వల్ల వాటిపైన ఉన్న నిందితుడి వేలిముద్రలు పోతాయి. అందుకే ఆధారాల కోసం వాటి ఫొటోలను తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి.
 • స్పై కెమెరాలు పెట్టిన ప్రదేశం నుంచి మనం ఇతరులకు ఫోన్‌కాల్‌ చేస్తే కాల్‌ డ్రాప్‌ అవుతుంది. స్పై కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్‌ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. అయితే కాల్‌డ్రాప్‌ అయినంత మాత్రాన అక్కడ స్పై కెమెరా ఉన్నట్టు కచ్చితంగా చెప్పలేం.
 • ట్రయల్‌ రూములు, వాష్‌రూములు ఉపయోగించే ముందు వాటిలో ఉండే అద్దాలను క్షుణ్ణంగా గమనించాలి. అద్దంమీద మన వేలు ఉంచితే.. అద్దానికి వేలికి మధ్య కొంత ఖాళీ ఉన్నట్టు గుర్తిస్తే అది సేఫ్‌. అద్దంలోని మన వేలి ప్రతిబింబంతో వేలు టచ్‌ అయితే అది ప్రమాదకరమైన పారదర్శకమైన గ్లాస్‌ అని గుర్తించాలి.
 • మీరు ఉన్న గదిలో లైట్లను ఆర్పివేసి సెల్‌ఫోన్‌లోని టార్చ్‌లైట్‌ను అద్దంపైన వేస్తే అవతలివైపు ఏవైనా ఉంటే కనిపిస్తుంది.
 • మొబైల్‌ ఫ్లాష్‌తో కూడా గుర్తించవచ్చు. ముందుగా ఆ గదిలో లైట్లు ఆపాలి. చీకటి గదిలో మన మొబైల్‌ కెమెరా ఫ్లాష్‌ను ఆన్‌చేసి గదిలోని అన్ని ప్రాంతాల్లో వేస్తూ చెక్‌ చేయాలి. అక్కడ ఎంత చిన్న స్పై కెమెరా ఉన్నా దాని లెన్స్‌పైన ఫోన్‌ ఫ్లాష్‌ పడితే వెంటనే మెరుస్తుంది.
 • స్మార్ట్‌ఫోన్‌లో హిడెన్‌ కెమెరా డిటెక్టర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని కూడా ఈ కెమెరాలను కనిపెట్టవచ్చు. అయితే ఈ యాప్స్‌ ద్వారా ఫోన్‌లోకి వైరస్‌లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

చట్టం ఏం చెప్తున్నది..?

 • ఎవరైనా వ్యక్తి (మహిళలు లేదా పురుషులు) అనుమతి లేకుండా వారి ఫొటోలు, వీడియోలు తీయడాన్ని చట్టప్రకారం వయోలేషన్‌ ఆఫ్‌ ప్రైవసీ లేదా వాయరిజం అంటారు.
 • అనుమతి లేకుండా హిడెన్‌ కెమెరాలు, సెల్‌ఫోన్లు తదితర పరికరాల ద్వారా ఇతరుల చిత్రాలు, వీడియోలు తీస్తే ఐటీయాక్ట్‌ సెక్షన్‌ 66 (ఈ) కింద కేసు మూడేండ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
 • ఇతరుల ప్రైవేటు పార్ట్‌ల వీడియోలు, చిత్రాలు వేరొకరితో పంచుకున్నా, పబ్లిష్‌ చేసినా ఐటీయాక్ట్‌ 67 కింద మూడేండ్ల వరకు జైలు శిక్ష.
 • ఆ వీడియోలు, ఫొటోలు చూపి బెదిరింపులకు పాల్పడితే ఐపీసీ 506 కింద రెండేండ్ల వరకు జైలు. ఐపీసీ 384 సెక్షన్‌ కింద మూడేండ్ల వరకు జైలు శిక్ష.
 • మహిళల ప్రైవేటు కార్యకలాపాలపై వీడియోలు, చిత్రాలు చిత్రీకరిస్తే ఐపీసీ సెక్షన్‌ 354 (సీ) కింద మూడేండ్ల వరకు జైలు శిక్ష.

కఠిన చర్యలు తప్పవు

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలపై వేధింపులకు పాల్పడినా, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించినా నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. సత్వరం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.

- Advertisement -

– స్టీఫెన్‌ రవీంద్ర, సీపీ, సైబరాబాద్‌

గుర్తించేందుకు ఎన్నో టెక్నాలజీలు

సీక్రెట్‌, హిడెన్‌ కెమెరాలు గుర్తించేందుకు మార్కెట్‌లో ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. యాంటీ డిటెక్టర్‌ హిడెన్‌ కెమెరా అమెజాన్‌లో రూ.2 వేలలోపు దొరుకుతుంది. అనుమానం ఉన్న చోట దీన్ని ఆన్‌చేస్తే కెమెరా ఉంటే ఇందులో లైట్‌తోపాటు బీప్‌ శబ్దం వస్తుంది. ఇంకా మంచిది కావాలంటే జామర్‌ కమ్‌ హంటర్‌ దొరుకుతుంది. దీని ధర కొంచం ఎక్కువ. ఎవరైనా స్పై కెమెరా పెట్టుకొని వచ్చినా అవతలి వ్యక్తి రికార్డు చేస్తున్నది లైవ్‌లో చూసుకోవచ్చు. స్పై, హిడెన్‌ కెమెరాలను గుర్తించేందుకు మొబైల్‌యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. కెమెరా మన ఫోన్‌ దగ్గరలో ఉంటే వెంటనే ఫోన్‌యాప్‌లో బీప్‌ అని శబ్దం వస్తుంది.

రజినీకాంత్‌, టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Mars Quake | వ‌ణికిన అరుణ గ్ర‌హం.. మార్స్‌పై భారీ భూకంపం

Moon Tourism : ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర

ఎగిరే కార్లు వ‌చ్చేస్తున్నాయి.. ఏసియాలోనే మొట్ట మొద‌టి ఫ్ల‌యింగ్ కారును తీసుకొస్తున్న‌ చెన్నై కంపెనీ

Flipkart Big Billion Days 2021 : అక్టోబ‌ర్ 7 నుంచి 12 వ‌ర‌కు సేల్‌.. ఈ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు

How to Detect Hidden Cameras | ఈ ట్రిక్స్‌తో హోటల్‌ రూంలోని స్పై, హిడెన్ కెమెరాలు క‌నిపెట్టేయొచ్చు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement