Mars Quake | వణికిన అరుణ గ్రహం.. మార్స్‌పై భారీ భూకంపం
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ మార్స్ గ్రహంపై మరోసారి భూకంపాన్ని ( Mars Quake ) గుర్తించింది.

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ మార్స్ గ్రహంపై మరోసారి భూకంపాన్ని ( Mars Quake ) గుర్తించింది. ఇప్పటి వరకూ మార్స్‌పై మానవాళికి తెలియని అతిపెద్ద, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్సైట్ గుర్తించినట్లు నాసా వెల్లడించింది. 4.2 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు.. ఏకంగా గంటన్నర పాటు సాగినట్లు తెలిపింది. ఈ నెల 18న ఈ అతిపెద్ద, సుదీర్ఘ భూకంపం నమోదైంది.
అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు మూడోసారి కనిపించడం గమనార్హం. గత నెల 25న ఇన్సైట్ తన సీస్మోమీటర్లో 4.2, 4.1 తీవ్రత కలిగిన రెండు భూకంపాలను గుర్తించింది. 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా ఈ నెల 18న కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల శక్తి ఐదు రెట్లు అని నాసా చెప్పింది. అంతేకాదు ఇన్సైట్ ల్యాండర్ ఉన్న చోటు నుంచి 8500 కిలోమీటర్ల దూరంలో ఈ 4.2 తీవ్రత ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అంత దూరంలో వచ్చిన ప్రకంపనలను ఇన్సైట్ గుర్తించడం ఇదే తొలిసారి.
ఇప్పుడు భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో నాసా శాస్త్రవేత్తలు ఉన్నారు. సాధారణంగా రాత్రి పూట, గాలులు తక్కువగా ఉన్న సమయంలో ఇన్‌సైట్‌లోని సీస్మోమీటర్ ఈ మార్స్ కంపాలను గుర్తించేది. అయితే ఈసారి మాత్రం పగటి సమయంలో ప్రకంపనలను ఇన్సైట్ రికార్డ్ చేసింది. 2018, మార్చిలో ఈ ఇన్సైట్ ల్యాండర్ మార్స్‌పై దిగింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- InSight Lander
- Mars
- Mars Quake
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

